సూర్యాపేట జిల్లా:బహుజన రాజ్యాధికార యాత్రలో భాగంగా బీఎస్పీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్.ఎస్.
ప్రవీణ్ కుమార్ కోదాడ నియోజకవర్గ వ్యాప్తంగా పర్యటిస్తున్న నేపథ్యంలో తేదీ:24-04-2022 ఆదివారం కోదాడ బాయ్స్ హై స్కూల్ లో సాయంత్రం 4 గంటలకు బహుజన సమాజ్ పార్టీ తలపెట్టిన బహుజన ఘీంకార బహిరంగ సభకు ఎస్సీ,ఎస్టీ,బీసీ,మైనార్టీ, అగ్రవర్ణ పేదలందరూ హాజరై విజవంతం చేయాలని బీఎస్పీ సూర్యాపేట జిల్లా ఇంఛార్జీ పిల్లుట్ల శ్రీనివాస్ పిలుపునిచ్చారు.ఈ బహిరంగ సభకు బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మంద ప్రభాకర్,పార్టీ రాష్ట్ర కో-ఆర్డినేటర్ ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్ లు హాజరవుతున్నట్లు అయన తెలిపారు.