మంత్రి గారూ... పాలకవీడు మండల కేంద్రంలోమౌలిక వసతులు కల్పించండి

సూర్యాపేట జిల్లా:పాలకవీడు మండల కేంద్రంలో ప్రజల యొక్క అవసరార్థం మౌలిక వసతుల కల్పనపై మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి దృష్టి సారించాలని సిపిఎం పాలకవీడు మండల కార్యదర్శి కందగట్ల అనంత ప్రకాష్ విజ్ఞప్తి చేశారు.గురువారం ఆయన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఓ బహిరంగ లేఖ రాశారు.

 Minister Provide Basic Facilities In Palakaveedu Mandal Centre , Palakaveedu Man-TeluguStop.com

పాలకవీడు మండలం ఏర్పడి సుమారు 8 సంవత్సరాలు కావస్తున్నా ప్రభుత్వ కార్యాలయాలు అరకొర వసతులతో అద్దె భవనాల్లో నడుస్తున్నాయని,వాటికి వెంటనే పక్కా భవనాలకు నిధులు మంజూరు చేసి నిర్మించుటపై దృష్టి సారించాలని కోరారు.మండలంలోని ఎమ్మార్వో కార్యాలయం,పోలీస్ స్టేషన్,వ్యవసాయ కార్యాలయం అద్దె భవనాల్లో నడుస్తున్నాయని సరిగా వసతులు లేవని కావునా దృష్టి సారించి నిర్మాణాలు చేపట్టాలని,నిర్మాణం చేపట్టానికి ప్రభుత్వ స్థలాలను కూడా గత ప్రభుత్వం గుర్తించిందని, అయినా ఈరోజు వరకు నిర్మాణం చేయలేదన్నారు.

మండల కేంద్రంలో ఆరోగ్య ఉప కేంద్రం పక్క భవనం కలిగి ఉన్నదని,ఆరోగ్య సేవలు నామమాత్రంగానే జరుగుతున్నాయన్నారు.ఈ ఉపకేంద్రాన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా మార్చి తగిన వైద్య సిబ్బంది నియమించి సేవలను అందుబాటులోకి తేవాలని విజ్ఞప్తి చేశారు.

ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా మార్చారని వార్తలు వచ్చాయని కానీ, ఇంతవరకు అమలుకు నోచుకోలేదన్నారు.గత ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రారంభించిన మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి నల్ల నీరని గొప్పలు చెప్పారని, మిషన్ భగీరథ అన్ని గ్రామాలకు నల్లాల ద్వారా నీరు రావడంలేదన్నారు.

నాలుగైదు రోజులకు ఒకసారి నీళ్లు వస్తున్నాయని,అది కూడా అరకొరగా వస్తున్నాయని, మిషన్ భగీరథ పథకం వల్ల గ్రామాల్లో గతంలో వేసిన చేతిపంపులు వాటర్ ట్యాంకులకు అమర్చిన మోటార్లు ఆయా గ్రామ పంచాయతీలు సిబ్బంది రిపేర్ చేయడం లేదని, కారణం అడిగితే ప్రభుత్వం మిషన్ భగీరథ ద్వారా నీరు అందిస్తున్నందున చేతిపంపులు మోటార్ల రిపేరుకు ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదని చెబుతున్నారని అన్నారు.రానున్నది వేసవికాలం అయినందున ప్రతి గ్రామంలో నల్లాల ద్వారా మంచినీరు సరఫరా అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

పాలకవీడు మండలంలో పోడు భూములు సాగు చేస్తుంటున్న గిరిజన రైతాంగానికి హక్కు పత్రాలు ఇచ్చే విధంగా కృషి చేయాలని విజ్ఞప్తి చేశారు

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube