భావ ప్రకటన స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కులు కాపాడుకోవడం పౌరులందరి బాధ్యతనిప్రజా సంఘాల ఐక్యవేదిక నేతలు అన్నారు.బుధవారం జిల్లా కేంద్రంలో ప్రజా సంఘాల ఐక్యవేదిక నేతలు నారాబోయిన వెంకట యాదవ్,బుద్ధసత్యనారాయణ, చామకూరి నరసయ్య ఆధ్వర్యంలో ప్రశ్నించే గొంతులపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల నిర్బంధం, రాజ్యహింస,అణిచివేతపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు ప్రజా సంఘాల నేతలు మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో ఎస్సీ,ఎస్టీ,బీసీ, మైనార్టీ వర్గాలపై అగ్రకుల దురంకార దాడులు నిత్యం పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు.
బైరి నరేష్, రెంజర్ల రాజేష్,మల్లికార్జున్ మరియు ఖమ్మం జిల్లాలో న్యాయవాదులపై, నిజామాబాద్,మహబూబ్ నగర్ జిల్లాలో కూడా దోపిడీ పాలకవర్గాల కుట్రలో భాగంగా హేతువాదం,నాస్తికత్వం, భౌతికవాదంపై దాడులు జరిగాయని అన్నారు.
చార్వాకులు,బుద్ధుడు నుండి మహాత్మ జ్యోతిబాపూలే, సావిత్రిబాయి పూలే, బాబాసాహెబ్ అంబేద్కర్, భగత్ సింగ్ లు అందించిన భారతీయ తాత్విక వారసత్వం మానవ మనుగడ పురోగమనానికి మూలమని తెలిపారు.
ప్రశ్నించే తత్వం ప్రశ్న లేకపోతే మానవ ప్రగతి లేదని,నేడు ఆ ప్రశ్ననే దాడికి గురవుతుందని,హత్య చేయబడుతున్నదనిఅవేదన వ్యక్తం చేశారు.భారత రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడే బాధ్యతను గుర్తెరిగిన ప్రజాతంత్ర వాదులం ప్రజా,పౌర సంస్థల ప్రతినిధులు అందరం రాజ్యాంగ హక్కులను కాపాడుకోవడానికి కలిసి ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు.
అలాగే విశాలమైన ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని, నిరసనలు కొనసాగించాలని తీర్మానించారు.హక్కుల సంఘాలపై,ప్రజాస్వామిక వాదులపై, ఉద్యమకారులపై అప్రకటిత నిషేధం, అప్రకటిత ఎమర్జెన్సీ పాలన కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయని,వీటిని ధీటుగా ఎదుర్కోవాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో మండారి డేవిడ్ కుమార్,మాండ్ర మల్లయ్య యాదవ్,దాసరి రాములు,రామోజీ, కునుకుంట్ల సైదులు, తలమల్ల హసేన్,రేపాక లింగయ్య,మామిడి అరవింద్,మిర్యాల మధు, నాగేంద్ర నాయక్,బండ్ల రమేష్,క్రాంతి కుమార్, వెంకటయ్య,వికాస్ తదితరులు పాల్గొన్నారు.