బ్యాంక్ ఆఫ్ బరోడాను బురిడీ కొట్టించిన కేటుగాళ్లు అరెస్ట్

సూర్యాపేట జిల్లా:నకిలీ బంగారం తాకట్టు పెట్టి అరకోటి కొట్టేసిన 8 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం రాయినిగూడెంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా( Bank of Baroda ) లో నకిలీ బంగారం తాకట్టు పెట్టి 53.89.000 లక్షల గోల్డ్ లోన్ తీసుకున్న కేటుగాళ్లను హుజూర్ నగర్ పోలీసులు పట్టుబడి చేసి నిందితులను రిమాండ్ కు తరలించారు.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మే నెలలో నేరేడుచర్ల మండలం వైకుంఠపురం గ్రామానికి చెందిన కేశవరావు రాకేష్ తో పాటు మరో 7గురు గరిడేపల్లి మండలం రాయినిగూడెం గ్రామంలోని బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంక్ లో నకిలీ బంగారం ( fake gold )తాకట్టు పెట్టి గోల్డ్ లోన్ తీసుకొని బ్యాంకర్లను బూరుడి కొట్టిన విషయం తెలిసిందే.ఆ నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

 Bank Of Baroda Scam Details , Bank Of Baroda, Scam , Arrested , Fake Gold , S-TeluguStop.com

ఏ1 రాకేష్ అతని భార్య బంధువుల పేరు మీద నకిలీ బంగారం పెట్టించి బ్యాంకులో అప్రయిజర్ తో చేతులు కలిపి నిజమైన బంగారమని ధ్రువీకరించడంతో బ్యాంకులో సిబ్బంది వారి అందరి పేర్లు మీద లోన్లు మంజూరు.ఏ1 నిందితుడు కేశవరపు రాకేష్ కనిపించకుండా తిరుగుతూ మంగళవారం ఇంటి వద్దనే ఉన్నాడని నమ్మదగిన సమాచారం మేరకు అందరినీ అరెస్టు చేసి రిమాండ్ నిమిత్తం హుజూర్ నగర్ కోర్టులో హాజరు పరిచినట్లు హుజూర్ నగర్ సిఐ చలమంద రాజు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube