హక్కుల సాధనకై మహిళా లోకం ఉద్యమించాలి:అర్వపల్లి లింగయ్య

సూర్యాపేట జిల్లా:హక్కుల సాధన కోసం మహిళా లోకం ఉద్యమించాలని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (ఎన్.పి.

 Arvapalli Lingayah, The Women's World Should Mobilize To Achieve Their Rights, A-TeluguStop.com

ఆర్.డి) జిల్లా అధ్యక్షుడు అర్వపల్లి లింగయ్య అన్నారు.బుధవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ నగర్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎన్.పి.ఆర్.డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వికలాంగ మహిళలకు సన్మానం చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్నా మహిళల పట్ల సమాజం చిన్నచూపు చూస్తుందన్నారు.అన్ని రంగాలలో మహిళలకు పురుషులతో సమానంగా హక్కులు కల్పించినప్పుడే మహిళ అభివృద్ధి అవుతుందని,మహిళల అభివృద్ధి దేశాభివృద్ధని అన్నారు.

ఈనెల 23,24 తేదీలలో హైదరాబాదులో జరిగే తొలి మహిళా వికలాంగుల రాష్ట్ర సదస్సు జరుగుతుందని,ఈ సదస్సుకు పెద్ద ఎత్తున వికలాంగ మహిళలు పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.అనంతరం వికలాంగ మహిళలకు పండ్ల పంపిణీ నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల జాతీయ వేదిక జిల్లా గౌరవ అధ్యక్షుడు శిరంశెట్టి రామారావు, నాయకురాలు వెంకటమ్మ, మల్లమ్మ,ఎల్లమ్మ,కవిత, పద్మ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube