రాయితీ సద్వినియోగం చేసుకోవాలి:జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే

సూర్యాపేట జిల్లా:తెలంగాణ రాష్ట్రం( Telangana State )లో రోడ్డు నీయమ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి పోలీసు వారు వాహనాలపై విధించిన జరిమానా ఈ-చాలన్ కేసుల్లో పెండింగ్ ఉన్న చలాన్ లపై రాష్ట్ర ప్రభుత్వం,పోలీసు శాఖ రాయితీని ప్రకటించింనదని సూర్యాపేట ఎస్పీ రాహుల్ హెగ్డే( Rahul Hegde ) ప్రకటనలో పేర్కొన్నారు.ఈ రాయితీ ప్రక్రియ డిసెంబర్ 26వ తేది నుండి అమలులోకి వచ్చిందని,ఈ అవకాశాన్ని వాహనదారులు,ప్రజలు సద్వినియోగం చేసుకుని వారి వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లను చెల్లించుకోవాలని విజ్ఞప్తి చేశారు.

 Concession Should Be Taken Advantage Of: District Sp Rahul Hegde, Telangana Stat-TeluguStop.com

ఆర్టీసీ బస్సులు( RTC buses ), తోపుడు బళ్లపై 90%, ద్విచక్ర వాహనాలపై 100%,ఆటోలు, నాలుగు చక్రాల వాహనాలు కార్లు,జీపులు,ట్యాక్సీలపై 60%,భారీ వాహనాలపై 50% రాయితీ ప్రకటించడం జరిగినదన్నారు.సూర్యాపేట జిల్లాలో 25వ తేదీ వరకు 68,968 ఈ-చలాన్ కేసులు పెండింగ్ లో ఉన్నాయని వీటిపై ప్రజలు స్పందించి గత మూడు రోజులుగా 30,600 ఈ-చలాన్ కేసుల( E-Challan )ను పరిష్కరించుకున్నారని తెలిపారు.దీనికి గాను 31.65 లక్షల రూపాయలు జరిమానా చెల్లించారని,మిగతా వారు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube