రాయితీ సద్వినియోగం చేసుకోవాలి:జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే
TeluguStop.com
సూర్యాపేట జిల్లా:తెలంగాణ రాష్ట్రం( Telangana State )లో రోడ్డు నీయమ నిబంధనల ఉల్లంఘనకు సంబంధించి పోలీసు వారు వాహనాలపై విధించిన జరిమానా ఈ-చాలన్ కేసుల్లో పెండింగ్ ఉన్న చలాన్ లపై రాష్ట్ర ప్రభుత్వం,పోలీసు శాఖ రాయితీని ప్రకటించింనదని సూర్యాపేట ఎస్పీ రాహుల్ హెగ్డే( Rahul Hegde ) ప్రకటనలో పేర్కొన్నారు.
ఈ రాయితీ ప్రక్రియ డిసెంబర్ 26వ తేది నుండి అమలులోకి వచ్చిందని,ఈ అవకాశాన్ని వాహనదారులు,ప్రజలు సద్వినియోగం చేసుకుని వారి వాహనాలపై ఉన్న పెండింగ్ చలాన్లను చెల్లించుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఆర్టీసీ బస్సులు( RTC Buses ), తోపుడు బళ్లపై 90%, ద్విచక్ర వాహనాలపై 80%,ఆటోలు, నాలుగు చక్రాల వాహనాలు కార్లు,జీపులు,ట్యాక్సీలపై 60%,భారీ వాహనాలపై 50% రాయితీ ప్రకటించడం జరిగినదన్నారు.
సూర్యాపేట జిల్లాలో 25వ తేదీ వరకు 68,968 ఈ-చలాన్ కేసులు పెండింగ్ లో ఉన్నాయని వీటిపై ప్రజలు స్పందించి గత మూడు రోజులుగా 30,600 ఈ-చలాన్ కేసుల( E-Challan )ను పరిష్కరించుకున్నారని తెలిపారు.
దీనికి గాను 31.65 లక్షల రూపాయలు జరిమానా చెల్లించారని,మిగతా వారు కూడా సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఇదేందయ్యా ఇది.. ప్రసాదం కొనకుంటే ఇలా చావా బాదుతారా?