సూర్యాపేట జిల్లా: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధులు,మాజీ ఎంపీ భీమిరెడ్డి నరసింహారెడ్డి జీవితం ఆదర్శనీయమని సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి అన్నారు.శుక్రవారం భీమిరెడ్డి నరసింహారెడ్డి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నల్లగొండ జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం బిఎన్ చేసిన కృషి మరువలేదన్నారు.మూడు సార్లు ఎంపీగా,రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేసి నీతిగా,నిజాయితీగా పని చేశారన్నారు.
భూస్వామ్య కుటుంబంలో పుట్టినప్పటికీ పేద, బడుగు,బలహీన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన మహానీయుడు బిఎన్ అన్నారు.
శ్రీరామ్ సాగర్ రెండోదశ పనులు ప్రారంభించాలని బిఎన్ చేసిన పోరాటం మూలంగా నేడు తుంగతుర్తి, సూర్యాపేట,కోదాడ నియోజకవర్గాల్లో లక్షలాది ఎకరాల్లో వరిపంట సాగు అవుతుందన్నారు.
నీతికి, నిజాయితీకి నిలువుటద్దంగా బిఎన్ నిలిచారన్నారు.చనిపోయేంతవరకు విలువలకు కట్టుబడి నిడారంబర జీవితాన్ని గడిపారని,యువత ఆయన చూపిన బాటలో పయనించాలని పిలుపునిచ్చారు.తెలంగాణ ప్రాంతంలో జరిగిన వీర తెలంగాణ సాయుధ పోరాటంలో తుపాకి పట్టి దొరలు, భూస్వాములు,జాగీరు దారులకు వ్యతిరేకంగా పోరాటం చేశారని అన్నారు.
బిఎన్ ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మట్టిపల్లి సైదులు,మేదరమెట్ల వెంకటేశ్వరరావు,కోట గోపి,చెరుకు ఏకలక్ష్మి,జిల్లా కమిటీ సభ్యులు బెల్లంకొండ వెంకటేశ్వర్లు, జిల్లపల్లి నరసింహారావు, ఎల్గూరి గోవింద్,కొప్పుల రజిత,మిట్టగనుపుల ముత్యాలు,చిన్నపంగ నరసయ్య,ప్రజా సంఘాల జిల్లా నాయకులు ఎం, రాంబాబు,రణపంగ కృష్ణ, మడ్డి అంజిబాబు, ఏనుగుల వీరాంజనేయులు,షేక్ సైదా,గుంజ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.