రెండు వేల నోట్ల రద్దు నిర్ణయం మోడీ ప్రభుత్వ తిరోగమన చర్య:మంత్రి జగదీష్ రెడ్డి

సూర్యాపేట జిల్లా:తన అనుయాయులకు లబ్ది చేకూర్చే రహస్య అజెండాలో భాగంగానేమోడీ( Narendra Modi ) రెండు వేల నోట్ల రద్దు చేశారని,దీనితోదేశంలో పేదరికం పెరిగి, తద్వారా దేశం ఆర్ధికంగా వెనుకబాటుకు గురై తిరోగమన బాట పడుతుందని రాష్ట్ర విద్యుత్ శాఖా మంత్రి గుంట్లకండ్ల జగదీష్ రెడ్డి ( Minister Jagadish Reddy )శనివారం జిల్లా కేంద్రంలోని మంత్రి క్యాంపు ఆఫిస్ లో రెండు వేల నోటు రద్దుపై ఆయన మీడియాతో మాట్లాడుతూ దేశాన్ని ఆర్ధికంగా దెబ్బతీసే కుట్రలా కనిపిస్తుందని, ఎందుకు చాలామణిలోకి తెచ్చారో?ఎందుకు రద్దు చేశారో? దేశ ప్రజలకు మోడీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.దేశ ప్రయోజనాలకోసమని బయటికి చెబుతున్నా,అంతర్గతంగా కొందరికి రహస్య లబ్ది చేకూరేలా కనిపిస్తుందని అనుమానం వ్యక్తంచేశారు.

 The Decision To Scrap Two Thousand Currency Notes Is A Step Backwards By The Mod-TeluguStop.com

.నోటు రద్దు వలన ప్రజలకు ఎలాంటి ప్రయోజనం కనిపించడం లేదన్నారు.ఒకపక్క మత విద్వేషాలు రెచ్చగొట్టడం మరోపక్క నోట్ల రద్దు చేయడం ద్వారాప్రజలని పేదరికంలోకి నెట్టే ఫ్యూడల్ ఆలోచనలు బీజేపీ పాలనలో కనిపిస్తున్నాయని వ్యాఖ్యానించారు.రేషన్ దుకాణంలో మోడీ ఫోటో లేదని బాధపడ్డ ఆర్ధికమంత్రి నిర్మలమ్మ,2 వేల నోట్ల ఉపసంహరణతో లాభం ఉంటే ఎందుకు మోడీ ఫోటో పెట్టి ప్రచారం చేయడంలేదో సమాధానం చెప్పాలని కోరారు.

దొంగ పనులకు ఆర్బీఐని( RBI ) ముందు పెట్టి మోడీ కోటరీ వ్యాపారులకు లాభం చేస్తున్నట్లుగా కనిపిస్తుందన్నారు.దేశ అభివృద్ధిని అడ్డుకునేలా 2 వేల నోట్ల ఉప సంహరణ ఉన్నందున ఇదే బీజేపీ పతనానికి నాందిగా బావిస్తున్నామన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube