నెమ్మికల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో రూ.3 లక్షలు గోల్ మాల్

సూర్యాపేట జిల్లా:ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థులకు ట్యూషన్, కళాశాల అభివృద్ధి కొరకు ప్రభుత్వం అందజేసిన నిధులను విద్యార్థులకు, కళాశాలకు ఖర్చు చేయకుండా గుట్టు చప్పుడు కాకుండా గోల్ మాల్ చేసిన సంఘటన సూర్యాపేట జిల్లాలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.ఉన్నతాధికారులు విచారణ చేపట్టినా తప్పును ఒప్పుకోవడంలో కిందిస్థాయి అధికారులు గుట్టు విప్పడం లేదన్న ఆరోపణలు వస్తున్నాయి.

 3 Lakhs Gol Mall In Nemmikal Govt Junior College-TeluguStop.com

వివరాల్లోకి వెళితే.సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) నెమ్మికల్ ప్రభుత్వ కళాశాలకు 2016-17 విద్యా సంవత్సరంలో విద్యార్థుల ట్యూషన్,కళాశాల మౌలిక వసతుల కల్పన కోసం మంజూరైన సుమారు రూ.4 లక్షల నిధులను ఖర్చు చేయకుండా నొక్కేసినట్లు కొందరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.ఆ నిధులను నెమ్మికల్ ఏపీజీవీబీ బ్యాంక్ నుండి ఎస్బిఐ బ్యాంక్ కు బదలాయించి,కళాశాలకు సంబంధించిన వ్యక్తి పేరున ఆ రూ.3లక్షలు చెక్కు ద్వారా డ్రా చేసినట్లు ఆరోపించారు.డబ్బులు డ్రా చేసిన వ్యక్తి 3 నెలలకే దొడ్డిదారిన ఫ్యాకల్టీ లెక్చరర్ గా కళాశాలలో విధులు నిర్వహిస్తుండడం గమనార్హం.

నిధుల దుర్వినియోగంపై అందిన ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారులు విచారణ చేపట్టినా ఏ ఒక్క అధికారి గుట్టు విప్పడం లేదని విమర్షలొస్తున్న నేపథ్యంలో ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు సరైన రీతిలో విచారణ చేపట్టి,నిధుల గోల్ మాల్ గుట్టు రట్టు చేసి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.ఈ విషయమై జిల్లా ఇంటర్ మీడియట్ అధికారి కృష్ణయ్యను వివరణ కోరగా నిధుల దుర్వినియోగం ఫిర్యాదుపై విచారణ చేస్తున్నామని,మరో వారం రోజుల్లో దానికి బాధ్యులైన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube