సూర్యాపేట జిల్లా:పెన్ పహాడ్ మండలం నుండి మంగళవారం ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి తరలి వెళ్తున్న ఆశా వర్కర్లను పోలీసులు అడ్డుకొని పెన్ పహాడ్ పోలీస్ స్టేషన్ కు తరలించారు.ఈ సందర్భంగా ఆశ కార్యకర్తల మండల అధ్యక్షురాలు నకిరేకంటి కవిత మాట్లాడుతూ మన ఆశ కార్యకర్తలకు ఐక్యత లేకపోవడం ఈ పరిస్థితికి కారణమని అన్నారు.
గత ప్రభుత్వం చేసిన తప్పిదాలకు మనం అనుభవించాల్సి వస్తుందని,టిఆర్ఎస్ కె.వి యూనియన్ కావాలని ఆశలను రెచ్చగొట్టి రోడ్డు మీదికి లాగడం జరిగిందని ఆరోపించారు.గత ప్రభుత్వంలో ఎన్నోసార్లు మెమొరండాలు ఇవ్వడం, ధర్నాలు చేయడం జరిగినా ఎందుకు న్యాయం చేయలేదని,గత ప్రభుత్వం మీద ఎందుకు ఈ యూనియన్ పోరాటం చేయలేదని ప్రశ్నించారు.ఆ యూనియన్ యొక్క మనుగడ కోసం ఆశలను ఇబ్బంది పెడుతున్నారని
గత ప్రభుత్వంలో టైంకి జీతాలు రాకపోగా,ఆశలకు రికార్డులు ఇవ్వకపోగా,వెట్టిచాకిరి చేయించేవారని గుర్తు చేశారు.
ఈ ప్రభుత్వంలో నెల మొదటి వారంలో జీతాలు రావడం జరుగుతున్నదని,ఈ ప్రభుత్వంలో మాకు ఎలాంటి ఇబ్బందులు లేవని,ఆశా కార్యకర్తల వేతనాలు ప్రస్తుతం 9000 రూపాయలు ఉన్నాయని,కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టో పెట్టిన విధంగా అధికారం రాగానే 18000 రూపాయల వేతనంతో పాటు ఈఎస్ఐ,పిఎఫ్,హెల్త్ ఇన్సూరెన్స్,ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిందని, ఈ ప్రభుత్వం మాకు అండగా ఉంటదని నమ్మకం ఉందన్నారు.ఆశాలకు ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమలు చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
అలాగే న్యాయం చేయని పక్షంలో మేము కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో ఆశాలు మామిడి లక్ష్మీ, మామిడి సబిత,మీసాల జ్యోతి,జహీర్ బేగం,ఇరుగు త్రివేణి,వెంకటరమణ,నెమ్మాది రజిని,పుట్టల రాధా,చిత్రం పద్మ, అలివేలు, సిహెచ్.
రమణ,సైదమ్మ, సుజాత తదితరులు పాల్గొన్నారు.