వైఎస్సార్ టిపికి టీఆర్ఎస్ కౌంటర్

సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డిపై ఏపూరి సోమన్న అనే చిల్లర రాజకీయాలు చేసే వ్యక్తి అనుచితమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని మండల టిఆర్ఎస్ నాయకులు ఏకాభిప్రాయంతో ఖండించారు.బుధవారం చింతలపాలెం మండల పరిధిలోని దొండపాడు గ్రామంలో టిఆర్ఎస్ ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు.

 Trs Counter To Ysr Tp-TeluguStop.com

ఈ సమావేశంలో టిఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ పొట్టకూటి కోసం పాటలు పాడుకునే ఏపూరి సోమన్న వైఎస్సార్ టిపి పార్టీలో చేరి,హుజూర్నగర్ గడ్డ మీదకొచ్చి ఎమ్మెల్యే ని విమర్శించడం సరికాదన్నారు.ఎవరైనా ఎమ్మెల్యేలను దుర్భాషలాడుతూ విమర్శిస్తే సహించేది లేదని ముక్త కంఠంతో తెలిపారు.

తెలంగాణ ఉద్యమ సమయంలో వైఎస్ఆర్ టిపి అధ్యక్షురాలు షర్మిల ఎక్కడున్నావ్ అని ప్రశ్నించారు.రెండు సంవత్సరాల పరిపాలన కాలంలో అభివృద్ధికి సుమారు 3500 కోట్ల రూపాయల నిధులను తీసుకువచ్చి అభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న శానంపూడి సైదిరెడ్డిని విమర్శించే స్థాయి ఏపూరి సోమన్నది కాదన్నారు.

అసలు తెలంగాణ రాష్ట్రంలో వైయస్సార్ టిపి ఉనికి ఉన్నదా అని ప్రశ్నించారు.ఈసారి ఇలాంటి విమర్శలు చేసినట్లయితే నాయకులు,కార్యకర్తలు ఊరుకునేది లేదని హెచ్చరించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube