సీఐటీయూ నాయకుల ముందస్తు అరెస్టులు దారుణం

సూర్యాపేట జిల్లా:గ్రామ పంచాయితీ కార్మికుల( Gram Panchayat workers ) న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని గ్రామ పంచాయతి వర్కర్స్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మంగళవారం హైదరాబాద్ ధర్నాకు వెళుతున్న సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలంలో పంచాయితీ కార్మికులను పోలీసులు ముందస్తు అరెస్టు చేసి, పోలీస్ స్టేషన్ కు తరలించడం దారుణమని సీఐటీయూ నాయకులు ఖండించారు.ఈసందర్భంగా సంఘం మండల అధ్యక్షుడు వెంకన్న మాట్లాడుతూ తమ డిమాండ్ల పరిష్కారం కొరకు రాష్ట్ర ప్రభుత్వానికి, అధికారులకు పలు రూపాలలో తెలియచేసినప్పటికి పరిష్కారం కొరకు ఏమాత్రం కృషి చేయకుండా అరెస్టులు చేయటం ద్వారా కార్మిక వ్యతిరేక చర్యను ప్రభుత్వం చాటుకొంటుందని విమర్శించారు.

 Early Arrests Of Citu Leaders Are Outrageous , Citu Leaders , Gram Panchayat Wor-TeluguStop.com

అరెస్టులతో కార్మిక ఉద్యమాలను ఆపలేరన్నారు.

అరెస్టైన వారిలో గ్రామ పంచాయతి యూనియన్ అధ్యక్షుడు నీలం అశోక్,నాయకులు మండల వీరన్న,మాతంగి నాగయ్య,బొడ్డు పిచ్ఛయ్య,ములకలపల్లి సైదమ్మ,మేడి వెంకన్న, నాగమ్మ,గడ్డం సంధ్య, సాకాని రాము తదితరులు ఉన్నారు

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube