సూర్యాపేట జిల్లా:కోదాడ ప్రభుత్వ ఆసుపత్రిలో దారుణం చోటుచేసుకుంది.దీర్ఘకాలిక వ్యాధి సోకిన గర్భిణీ మహిళకు ప్రసవం చేసేందుకు వైద్యులు నిరాకరించిన ఘటన మానవత్వాన్ని ప్రశ్నించింది.
కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం… కోదాడకు చెందిన హెచ్ఐవి సోకిన ఓ మహిళకు పురిటి నొప్పులు రావడంతో సామాజిక ఆరోగ్య కేంద్రానికి వెళ్లగా దీర్ఘకాలిక వ్యాధి ఉన్నట్లు గుర్తించిన వైద్యసిబ్బంది కిట్లు లేవంటూ సూర్యపేట ప్రభుత్వ ఆసుపత్రికి రాసారు.పురిటి నొప్పులతో గర్భిణీని సూర్యాపేటకు వెళ్తుండగా మార్గం మధ్యలో పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది.
సకాలంలో ఆసుపత్రికి చేరుకోకపోవడంతో శిశువు పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ ఆసుపత్రికి తరలించారు.