సూర్యాపేట జిల్లా:చింతలపాలెం మండలం పులిచింతల ప్రాజెక్టులో వ్యక్తి మృతదేహం లభ్యమైంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలంలోని పులిచింతల ప్రాజెక్టు కాలనీకి చెందిన రుద్రపంగు శివయ్య(50)గా గుర్తించారు.
శివయ్య రోజూవారీ కూలీ పని చేసుకుంటూ జీవనం గడుపేవాడు.గత మూడు రోజుల క్రితం ఇంటి నుంచి బయటకు వెళ్లిన అతను గురువారం తెల్లవారుజామున ప్రాజెక్టులోని మూడవ గేట్ నెంబర్ వద్ద నీటిలో తేలియాడుతూ మృతదేహంగా కనిపించాడు.
సమాచారం అందుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం హుజూర్ నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.మృతునికి భార్య, ఇద్దరు కుమారులు,ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
మరణానికి గల కారణాలు తెలియరాలేదు.