సూర్యాపేట జిల్లా:బంగారు తెలంగాణా అంటే ఇదేనా సారూ,ఈ రోడ్డుపై వెళ్లాలంటే నరకం కనిపిస్తుందని ఓ రెండు గ్రామాల,పరిసర ప్రాంతాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్న అద్వాన్నపరిస్థితి సూర్యాపేట జిల్లా వెలుగు చూసింది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మఠంపల్లి మండలంలో బక్కమంతులగూడెం నుండి వెంకట్రామపురం వెళ్ళే రహదారిపై ఒక్కసారి ప్రయాణం చేస్తే మళ్ళీ ఆవైపుకు వెళ్లాలంటే భయపడి పోతారు.
ఎందుకనిఅంటారా అంతలా ఆ రోడ్డుపై పెద్ద పెద్ద గుంతలు మనకు దర్శనమిస్తాయి.ద్విచక్ర వాహనాలు ఆ రోడ్డుపై ఎక్కితే ఇక సక్కగా ఇంటికి వెళతామనే గ్యారెంటీ లేదు.
కనీసం పాదచారులు కూడా సక్రమంగా నడవలేని పరిస్థితి నెలకొంది.వర్షాకాలంలో ఆగుంతల్లో నీళ్లు నిలిచి ఎక్కడ ఏ ప్రమాదకర గుంత ఉందో తెలియక కొత్తగా ఆ రోడ్డుపై ప్రయాణించే వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు.
ఈ రోడ్డుపై బక్కమంతులగూడెం నుండి వెంకట్రామపురం వరకు వెళ్లాలంటే నరకయాతన పడుతున్నారు.ఇక గర్భిణీ స్త్రీలు ఈ రోడ్డుపై హాస్పిటల్ కు వెళ్ళాలంటే పరిస్థితి మరింత దారుణంగా ఉంటుంది.
అత్యవసర పరిస్థితుల్లో 108 అంబులెన్స్ వచ్చే పరిస్థితి కూడా లేక పోవడంతో గ్రామస్థులు అనేక ఇబ్బందులకు గురవుతున్నారు.బంగారు తెలంగాణా అని,హుజూర్ నగర్అ భివృద్ధి పథంలో దూసుకుపోతుందని పదేపదే వేదికల మీద చెబుతున్న ఎమ్మెల్యే గారూ మీ సొంత మండలంలో రోడ్డు ఎలాంటి పరిస్థితిలో ఉందో ఒక్కసారి వెంకట్రామపురం రోడ్డుపై ప్రయాణం చేసి చూడాలని స్థానికులు కోరుతున్నారు.
అభివృద్ధి అంటే సభలు,సమావేశాల్లో ఉపన్యాసాలు,సోషల్మీడియాలో పోస్టింగ్స్ ద్వారా కాదని,క్షేత్రస్థాయిలో ఎలాంటి అభివృద్ధి జరుగుతుందో పర్యవేక్షణ చేయాలని, మీ పార్టీ నాయకులు చెప్పే మాటలు నమ్మి అంతా బాగుందని అనుకోవద్దని అంటున్నారు.ఇప్పటికైనా ఈ రహదారిపై దృష్టి పెట్టి కనీసం మరమ్మతులు చేయించి ఈ ప్రాంత ప్రజలకు రహదారి ప్రమాదాల నుండి విముక్తి కలిగించాలని వేడుకుంటున్నారు.