శివసేన అధినేత ఉద్ధవ్ థాకరే, మహారాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ షిండేలకు షాక్ తగిలింది.విల్లు, బాణం సింబల్‌ను ఫ్రీజ్ చేసినట్లు కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది.
గత కొన్ని రోజులుగా మాదంటే మాదంటూ కోర్టుకెక్కిన రెండు వర్గాలకు ఈసీ ఊహించని ఝలక్ ఇచ్చింది.గుర్తుపై ఈసీ నిర్ణయం తీసుకోవచ్చని సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో.
సింబల్‌ను ఫ్రీజ్ చేస్తూ నిర్ణయం తీసుకుంది ఎన్నికల సంఘం.కావాలంటే ఉప ఎన్నికల వరకు కొత్త సింబల్ ఇస్తామని సలహా ఇచ్చింది ఎన్నికల సంఘం.







