సూర్యాపేట జిల్లా:ప్రతి సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు తమ సమస్యలపై దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా అదనపు కలెక్టర్ ఎస్.మోహన్ రావు తెలిపారు.
సోమవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు తమ విన్నపాలను జిల్లా అదనపు కలెక్టర్ కు అందజేశారు.ప్రజావాణి కార్యక్రమంలో వచ్చిన దరఖాస్తులను శాఖల వారీగా జిల్లా అధికారులకు అందజేసి సమస్య పరిష్కారానికి తగు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
నేటి ప్రజావాణి కార్యక్రమంలో పెన్షన్స్ సమస్యలపై 10 దరఖాస్తులు అందజేశారని,భూ సమస్యలపై వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రైతులు నుండి తాహాల్దార్లకు 49 దరఖాస్తులు,మొత్తం జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యలపై 67 దరఖాస్తులు వచ్చాయన్నారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు రాజేంద్ర కుమార్,కిషోర్ కుమార్,అన్ని శాఖల జిల్లా అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.







