సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలో అవినీతి అధికారులే టార్గెట్ గా ఏసీబీ అధికారులు డేగ కన్ను వేసినట్లు సమాచారం.ముఖ్యంగా కృష్ణపట్టే ప్రాంత విద్యుత్,రెవిన్యూ,పోలీస్ శాఖలో ఒక్కొక్క కేసుకు ఒక్కొక్క రేటు ఫిక్స్ చేస్తూ వసూళ్ల పర్వానికి దిగుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఇది ఆంధ్రా తెలంగాణ సరిహద్దు ప్రాంతం కావడంతో విచ్చలవిడిగా ఇసుక,పిడిఎస్ బియ్యం అక్రమ రవాణా జరిగే అవకాశం ఉంది.అయితే చింతలపాలెం సంఘటనతో అంతా అప్రమత్తమయ్యారని వినికిడి.
ఉమ్మడి నల్గొండ జిల్లాలో 15 నెలల్లో 20 కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతుంది.