సూర్యాపేట జిల్లా:గరిడేపల్లి మండలం కల్మల్ చెరువు గ్రామ చెరువుకట్ట వద్ద పొలంలో తాటిచెట్లు కొడుతుండగా ప్రమాదవశాత్తు చెట్టు మీద పడి శితలతండాకు చెందిన గుగులోతు శ్రీను (52) అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
మృతుడు కల్మలచెరువు గ్రామానికి చెందిన రైతు పొలంలో తాటి చెట్లను తొలగించేందుకు కూలికి మాట్లాడుకుని వెళ్ళాడని సమాచారం.