కుక్కల నియంత్రణపై చర్యలేవి...?

సూర్యాపేట జిల్లా: తెలంగాణ రాష్ట్రంలో వీధి కుక్కల, పిచ్చి కుక్కల స్వైర విహారంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు.ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ప్రతీ రోజు ఏదో ఒక చోట ఎవరో ఒకరు వీధి కుక్కల బారిన పడి గాయపడుతున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి.

 Calf Died In The Attack Of Stray Dogs, Calf , Stray Dogs, Nalgonda District, Str-TeluguStop.com

తాజాగా బుధవారం తెల్లవారుజామున సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం లక్కవరం గ్రామంలో ఓ గేదె లేగ దూడను కుక్కలు పీక్కుతిన్న ఘటన గ్రామ ప్రజలను భయకంపితులను చేసింది.

పాలుతాగే లేగ దూడ లేకపోవడంతో ఆ గేదె మూగజీవి పెట్టే అరుపులకు ఆ రైతు కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

రాష్ట్ర ప్రభుత్వం కుక్కల నివారణ కోసం ప్రత్యేక కార్యాచరణ తీసుకుంటామని చెప్పి రోజులు గడుస్తున్నా దానిపై ఎలాంటి చర్యలు లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.ఇప్పటికైనా యుద్ద ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube