సమయం ఆసన్నమైంది-బీసీలు ఉద్యమ బాట పట్టాలి

సూర్యాపేట జిల్లా:సామాజిక న్యాయం కొరకు బీసీలు ఐఖ్యంగా ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైందని జాతీయ బీసీ సంక్షేమ సంఘం,తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోడేపల్లి కృష్ణమాచారి ఉద్ఘాటించారు.ఆదివారం హుజూర్ నగర్ పట్టణంలో జరిగిన బీసీ సంక్షేమ సంఘం పట్టణ మరియు మండల కమిటీల ఎన్నికల సమావేశానికి ఆయన ముఖ్యాతిథిగా హాజరై మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటినప్పటికీ,ఈ దేశంలో బీసీలు ఇంకా సామాజిక వివక్షతకు గురవుతూనే ఉన్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

 The Time Has Come—bc's Must Take The Initiative-TeluguStop.com

ఈ దేశంలో జంతువులకు, పశుపక్షాదులకు స్పష్టమైన లెక్కలు ఉన్నాయని,కానీ, దేశ జనాభాలో సగానికి పైగా ఉన్న బీసీల శాతం ఎంతో కేంద్ర ప్రభుత్వం వద్ద స్పష్టమైన లెక్కలు లేకపోవడం దురదృష్టకరమని అన్నారు.కేంద్రప్రభుత్వం త్వరలో చేపట్టబోయే జనాభా లెక్కల్లో,బీసీ జనగణన చేపట్టి,ఏ కులం శాతం ఎంత ఉందో,అంతే దామాషా పద్ధతుల్లో పార్లమెంట్లో రాజకీయ రిజర్వేషన్ ప్రవేశపెట్టి జనాభా ప్రాతిపదికన వారి వారి వాటాల ప్రకారం సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో కూడా బడ్జెట్లో 50% నిధులు కేటాయించి బీసీల అభివృద్ధికి పాటుపడాలని సూచించారు.తెలంగాణలోని బీసీ యువతకు స్వయం ఉపాధి కొరకు రుణాలు ఇస్తామని టిఆర్ఎస్ ప్రభుత్వం అట్టహాసంగా ప్రకటించి,ఇంటర్వ్యూలు నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేసి నాలుగు సంవత్సరాలు అయినప్పటికీ ఎంపిక చేయబడ్డ 5,54,000 మందిలో కేవలం 10,000 మందికి ఇచ్చి ఇప్పటికి ఐదు లక్షల నలభై నాలుగు వేల మంది లబ్ధిదారులను నిర్లక్ష్యం చేస్తూ వస్తున్నారని, ఎంపిక చేయబడ్డ లబ్ధిదారులందరికీ తక్షణమే రుణాలు మంజూరు చేయాలని కోరారు.

కేంద్రంలో సుమారు 75 మంత్రిత్వ శాఖలు ఉండగా,బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని ఎన్నిసార్లు కోరినప్పటికీ కేంద్రంలోని పాలకుల చెవికి ఎక్కడం లేదన్నారు.బీసీ జనగణన పట్ల బిజెపి పార్టీ తమ వైఖరిని వెల్లడించాలని,అధికారంలో లేనప్పుడు ఒక మాట ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడటం బిజెపి నాయకత్వానికి తగదని హితవు పలికారు.

ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం సూర్యాపేట జిల్లా కమిటీ కన్వీనర్ ధూళిపాళ ధనుంజయ నాయుడు,బీసీ సంక్షేమ సంఘం హుజుర్ నగర్ నియోజకవర్గ అధ్యక్షులు ధూళిపాళ శ్రీనివాస్,జిల్లా ప్రధాన కార్యదర్శి గుండు రాంబాబు,బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చీకూరి లీలావతి, రాయల వెంకటేశ్వర్లు జనిగేల శ్రీనివాస్,గడ్డం అంజి యాదవ్,కోలపాటి వెంకటేశ్వర్లు,గూడెపు దీప,బొడ్డు గోవిందరావు,చేపూరి నర్సింహా చారీ,ఉదారి యాదగిరి,గొల్లగోపు రాధాకృష్ణ,బండి నాగేశ్వరరావు, మేకల సైదులు,మేకల వెంకటేశ్వర్లు,సైదులు, హనుమాన్ చారి,రుద్రోజు శ్రీను,రాళ్లబండి శ్రీను,నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube