సూర్యాపేట జిల్లా:దారిద్ర రేఖకు దిగువన ఉన్న పేదలకు రేషన్ షాపుల ద్వారా రేషన్ బియ్యం ఇవ్వాల్సి ఉండగా సూర్యాపేట పట్టణంలో రేషన్ డీలర్లు( Ration dealers ) సిండికేట్ గా మారి పేదలకు రేషన్ ఇవ్వకుండా డబ్బులు ఇస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం పట్టణ కార్యదర్శి వల్లపుదాసు సాయికుమార్ డిమాండ్ చేశారు.మంగళవారం సూర్యాపేట( Suryapet ) పట్టణంలోని 7 వార్డులో జరిగిన సిపిఎం శాఖ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదలందరికీ రేషన్ షాపు ద్వారా మనిషికి 6 కేజీల బియ్యం ఇవ్వాల్సి ఉండగా,పట్టణంలోని రేషన్ డీలర్లు అందరూ కుమ్మక్కై పేదలకు ఇవ్వాల్సిన బియ్యాన్ని బ్లాక్ మార్కెట్ కు తరలిస్తూ బియ్యానికి బదులు పేదలకు కేజీకి రూ.10 చొప్పున నగదు ఇస్తున్నారని ఆరోపించారు.
ఇదేమిటని ప్రశ్నిస్తే నీ దిక్కున్న చోట చెప్పుకోమని డీలర్లు బెదిరిస్తున్నారని అన్నారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో రేషన్ డీలర్లు నిస్సిగ్గుగా బియ్యానికి బదులు డబ్బులు ఇస్తున్న రెవిన్యూ అధికారులు, జిల్లా యంత్రాంగం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.పేదలకు ఇవ్వాల్సిన రేషన్ బియ్యాన్ని బ్లాక్ మార్కెట్ కు తరలిస్తూ అక్రమ సంపాదనకు మరిగిన రేషన్ డీలర్లపై జిల్లా కలెక్టర్ స్పందించి అక్రమాలకు పాల్పడుతున్న రేషన్ డీలర్ల లైసెన్సును రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
రేషన్ షాపులో నిరంతరం తనిఖీలు చేయవలసిన రెవిన్యూ అధికారులు ( Revenue Officers )రేషన్ డీలర్లు ఇచ్చే కాసులకు కక్కుర్తి పడినా ఇటువైపు చూసిన నాథుడే డే లేడని విమర్శించారు.తక్షణమే రేషన్ డీలర్లు తమ పద్ధతిని మార్చుకోవాలని లేనియెడల సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో మామిడి సుందరయ్య,వెంకటమ్మ, ధనమ్మ,రాములు,పుల్లయ్య,కవిత,మంజుల తదితరులు పాల్గొన్నారు.