సూర్యాపేట జిల్లా:పెన్ పహాడ్ మండల పరిధిలోని నూర్జంపేట గుట్టల్లో అక్రమంగా సారా తయారు చేస్తున్నారని నమ్మదగిన సమాచారం మేరకు ఎస్ఐ కస్తాల గోపికృష్ణ తమ సిబ్బందితో కలిసి గుట్టల ప్రాంతంలో తనిఖీలు నిర్వహించగా తెల్ల బెల్లం పానకం దొరకడంతో స్వాధీనం చేసుకుని ఒక వ్యక్తిపై కేసు నమోదు చేశారు.ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ అక్రమంగా సారా తయారు చేసినా,సారా అమ్మినా కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
మండల పరిధిలోని వివిధ తండాలలో, గుట్టలలో తనిఖీలు నిర్వహిస్తున్నామని,సారా తయారు చేస్తూ దొరికిన వారిపై కేసు నమోదు చేస్తామని చెప్పారు.ఈ ప్రవీణ్,నరేష్ రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.