నాణ్యత లేని గోనే సంచులు వడ్లు నేలపాలు...!

సూర్యాపేట జిల్లా:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పౌర సరఫరాల శాఖ కన్నాలున్న గోనె సంచులు సరఫరా చేయడంతో ఐకెపి, పిఎసిఎస్ నిర్వాహకులకు, రైతులకు తీరని నష్టం వాటిల్లుతున్న సంఘటన సూర్యాపేట జిల్లా అనంతగిరి  మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో వెలుగులోకి వచ్చింది.పలువురు రైతులు తెలిపిన వివరాల ప్రకారం…పౌర సరఫరాల శాఖ నుండి సరఫరా అవుతున్న గోనె సంచులు పాతపడి,చినిగిపోయి ఉండడంతో వాటిలో నింపిన ధాన్యం రంధ్రాల నుండి కారిపోతున్నాయని,అలాగే సంచులలో ధాన్యాన్ని నింపి తరలిస్తుంటే లారీలో తాడుతో కట్టడానికి పట్టు ఉండడం లేదని నిర్వాహకులు,రైతులు ఆరోపిస్తున్నారు.

 Low-quality Gone Bags Are A Waste Of Rice , Department Of Civil Supplies , Rice-TeluguStop.com

గోనె సంచుల్లో నాణ్యత లేకపోవడంతో ఐకెపి, పిఎసిఎస్ నిర్వాహకులకు, రైతులకు అపార నష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గోనె సంచుల్లో పటుత్వం లేక కేంద్రాల నుండి ధాన్యాన్ని తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలో పడిపోతాయేమోనని భయాందోళనకు గురవుతున్నారు.

ఇప్పటికైనా పౌర సరఫరాల శాఖ స్పందించి నాణ్యమైన కొత్త గోనె సంచులను సరఫరా చేయాలని కోరుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube