నాణ్యత లేని గోనే సంచులు వడ్లు నేలపాలు…!
TeluguStop.com
సూర్యాపేట జిల్లా:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలకు పౌర సరఫరాల శాఖ కన్నాలున్న గోనె సంచులు సరఫరా చేయడంతో ఐకెపి, పిఎసిఎస్ నిర్వాహకులకు, రైతులకు తీరని నష్టం వాటిల్లుతున్న సంఘటన సూర్యాపేట జిల్లా అనంతగిరి మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలలో వెలుగులోకి వచ్చింది.
పలువురు రైతులు తెలిపిన వివరాల ప్రకారం.పౌర సరఫరాల శాఖ నుండి సరఫరా అవుతున్న గోనె సంచులు పాతపడి,చినిగిపోయి ఉండడంతో వాటిలో నింపిన ధాన్యం రంధ్రాల నుండి కారిపోతున్నాయని,అలాగే సంచులలో ధాన్యాన్ని నింపి తరలిస్తుంటే లారీలో తాడుతో కట్టడానికి పట్టు ఉండడం లేదని నిర్వాహకులు,రైతులు ఆరోపిస్తున్నారు.
గోనె సంచుల్లో నాణ్యత లేకపోవడంతో ఐకెపి, పిఎసిఎస్ నిర్వాహకులకు, రైతులకు అపార నష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గోనె సంచుల్లో పటుత్వం లేక కేంద్రాల నుండి ధాన్యాన్ని తరలిస్తున్న క్రమంలో మార్గమధ్యలో పడిపోతాయేమోనని భయాందోళనకు గురవుతున్నారు.
ఇప్పటికైనా పౌర సరఫరాల శాఖ స్పందించి నాణ్యమైన కొత్త గోనె సంచులను సరఫరా చేయాలని కోరుతున్నారు.
లాంగ్ అండ్ స్మూత్ హెయిర్ కోసం ఈ ఫ్రూట్ మాస్క్ ను తప్పక ట్రై చేయండి!