సినిమా పరిశ్రమలో నిత్యం చిత్ర విచిత్రాలు జరుగుతుంటాయి.ఎవరు ఎవరికి హ్యాండిస్తారో చెప్పడం కష్టం.
కొందరు దర్శకులు హీరోలకు హ్యాండిస్తే.మరికొందరు హీరోలు దర్శకులకు హ్యాండిస్తారు.
ఇంకొందరు నిర్మాతలు దర్శకులకు హ్యాండివ్వగా కొందరు దర్శకుడు నిర్మాతలకు హ్యాండిచిన సందర్భాలున్నాయి.అయితే రాజకీయాల్లో నుంచి సినిమాల్లోకి వచ్చిన చిరంజీవి పూరీ జగన్నాథ్ తో కలిసి ఆటో జానీ పేరుతో సినిమా చేయాలని అనుకున్నాడు.
కానీ సెకెండాఫ్ కథ నచ్చలేదని రిజెక్ట్ చేశాడు.అదే సమయంలో వినాయక్ తో కలిసి ఖైదీ నెంబర్ 150 చేశాడు.
అటు సోగ్గాడే చిన్నినాయనే సినిమా దర్శకుడితో మరో సినిమా చేస్తానని చెప్పిన నాగ్ ఆ తర్వాత మరో సినిమాకు ఓకే చెప్పాడు.
అటు మహర్షి దర్శకుడు వంశీ పైడిపల్లితో మరో సినిమా చేస్తానని చెప్పిన మహేష్ బాబు ఆ తర్వాత పరుశురామ్ సినిమాకు ఫిక్స్ అయ్యాడు.
అటు సుకుమార్ తో మరోమూవీ చేస్తానని చెప్పిన ప్రిన్స్ ఆయనకూ హ్యాండ్ ఇచ్చాడు.పూరీతో సినిమా చేస్తానని చెప్పినా కథ బాలేదని రిజెక్ట్ చేశాడు.
అటు సంతోష్ శ్రీనివాస్ తో సినిమా చేస్తానని చెప్పిన రవితేజ గోపీచంద్ తో కలిసి క్రాక్ మూవీ చేశాడు.అటు ప్రశాంత్ నీల్తో కలిసి ప్రభాస్ ఓ సినిమా చేస్తానని చెప్పినా చాలా కాలం నానబెట్టాడు.అటు అల్లు అర్జున్ కూడా దర్శకులకు బాగానే హ్యాండ్ ఇస్తున్నాడు.వేణు శ్రీరామ్ తో కలిసి ఓ సినిమా చేస్తానని చెప్పి ఇంకా ఓకే చేయలేదు.అటు వక్కంతం వంశీతో సినిమా చేస్తానని చెప్పిన జూనియర్ ఎన్టీఆర్ తను రెడీ చేసుకున్న స్ర్కిప్ట్ బాలేదని పక్కన పెట్టాడు.మరికొందరు దర్శకులు సైతం హీరోలకు హ్యాండ్ ఇచ్చారు నాగ చైతన్యతో సినిమా చేస్తానని చెప్పిన పరుశురామ్ మహేష్ బాబుతో సినిమా చేశాడు.
అటు వెంకటేష్ తో సినిమా చేస్తానని చెప్పిన త్రివిక్రమ్ వెంకీని కాదని పవన్ తో అజ్ఞాతవాసి సినిమా చేశాడు.
అటు చిరంజీవి ఆచార్య తర్వాత రామ్ చరణ్ తో సినిమా చేస్తానని చెప్పిన కొరటాల శివ ప్రస్తుతం అల్లు అర్జున్ తో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు.