ప్రస్తుత వింటర్ సీజన్ లో ఆస్తమా బాధితులు ఎంతగానో ఇబ్బంది పడుతుంటారు.చలి పులి కారణంగా ఆస్తమా లక్షణాలైన దగ్గు, ఆయాసం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, చాతి బిగుతుగా మారడం వంటివి తీవ్రతరంగా మారుతుంటాయి.
అయితే ఈ లక్షణాలను కంట్రోల్ చేయడానికి కొన్ని కొన్ని ఆహారాలు అద్భుతంగా సహాయపడతాయి.ముఖ్యంగా ఇప్పుడు చెప్పబోయే జ్యూస్ ను తీసుకుంటే ఆస్తమా కంట్రోల్ అవ్వడమే కాదు వెయిట్ లాస్ కూడా అవుతారు.
మరి ఇంతకీ ఆ జ్యూస్ ఏంటి.? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి.? వంటి విషయాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ముందుగా ఒక పైనాపిల్ తీసుకుని తొక్క చెక్కేసి వాటర్ లో శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
ఈ ముక్కలను మిక్సీ జార్ లో వేసి వాటర్ పోసి మెత్తగా గ్రైండ్ చేసుకుని జ్యూస్ సపరేట్ చేసి పెట్టుకోవాలి.ఆ తర్వాత బ్లెండర్ తీసుకుని అందులో ఒక కప్పు అరటిపండు ముక్కలు, ఐదు నుంచి ఆరు ఫ్రెష్ పాలకూర ఆకులు, మూడు గింజ తొలగించిన ఖర్జూరాలు, ఒక చిన్న కప్పు వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా గ్రైండ్ చేసుకున్న మిశ్రమంలో ఒక గ్లాసు ఫ్రెష్ పైనాపిల్ జ్యూస్, వన్ టేబుల్ స్పూన్ తేనె వేసి బాగా కలిపి సేవించాలి.ఈ పైనాపిల్ బనానా పాలకూర జ్యూస్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ముఖ్యంగా ప్రస్తుత వింటర్ సీజన్ లో ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల ఆస్తమా లక్షణాలు అదుపులో ఉంటాయి.వెయిట్ లాస్ అవుతారు.గుండె పోటు వచ్చే రిస్క్ తగ్గుతుంది.రోగ నిరోధక వ్యవస్థ బలపడుతుంది.
జలుబు దగ్గు వంటి సీజనల్ వ్యాధులు దరిదాపుల్లోకి రాకుండా ఉంటాయి.మరియు ఈ జ్యూస్ ను తీసుకోవడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు సైతం మెరుగ్గా మారుతుంది.