సూర్యాపేట జిల్లా:అక్రమ అరెస్టులకు భయపడేది లేదని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు బోడ శ్రీరాములు మాదిగ స్పష్టం చేశారు.శుక్రవారం ఆయన మాట్లాడుతూ ఎమ్మార్పీఎస్ నాయకులను సూర్యాపేట రూరల్ పోలీసులు ముందుస్తుగా అరెస్ట్ చేయడం తగదని అన్నారు.
మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ గత 28సంవత్సరాలుగా ఎస్సీల ఏబీసీడీ వర్గీకరణ కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నారని తెలిపారు.బీజేపీ పార్టీ వర్గీకరణ ఉద్యమ మొదటి నుండి మద్దతు ఇస్తూ,ప్రతి ఎన్నికల మ్యానిపేస్టోలో పొందుపరిచారని,గతంలో బీజేపీ అగ్రనాయకులు ఎల్.కె.అద్వానీ,నితిన్ గట్కారి అప్పటి కేంద్ర ప్రభుత్వానికి వర్గీకరణను సమర్థిస్తూ లేఖలు వ్రాసారని గుర్తు చేశారు.సుస్మాశ్వరాజ్ ప్రతిపక్ష హోదాలో పార్లమెంట్ లో బిల్లు పెట్టండి మేము మద్దతు ఇస్తామని ప్రకటన చేశారని అన్నారు.బీజేపీ మూల సింద్ధాంతం,ఈదేశ సంపద,అవకాశాలు,చివరి పేదవాడి వరకు చేరాలనే దీన్ దయల్ అతంత్యోదయ స్పూర్తికి విరుద్దంగా బీజేపీ ప్రవర్తిస్తుందని ఆరోపించారు.
బీజేపీ అధికారంలోకి వచ్చిన 100 రోజులలో ఏబీసీడీ వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చిన పార్టీ అని,అధికారంలోకి వచ్చి 8 సవత్సరాలు అయినా పార్లమెంట్ లో వర్గీకరణ బిల్లుకు చట్ట బద్దత కల్పించకుండా నిర్లక్ష్యం వహిస్తుందని విమర్శించారు.హామీ ఇచ్చి నిర్లక్ష్యం చేయడం అంటే మాదిగలను వంచించినట్లుగా,మాదిగలను అవమానించినట్లుగా భావిస్తున్నామన్నారు.
ఎమ్మార్పీఎస్ మంద కృష్ణ మాదిగ పిలుపు మేరకు జూలై 2 సడక్ బంద్,జూలై 3 మహాధర్నాను విజయవంతం చేయాలని మాదిగ ప్రజలకు పిలుపునిచ్చారు.బీజేపీ పార్టీ ఈరోజు వర్గీకరణకు అనుకూల ప్రకటన చేసి,తమ అధినేత మంద కృష్ణ మాదిగ ను చర్చలకు ఆహ్వానించాలని డిమాండ్ చేశారు.
సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్ మహాసభను తప్పకుండా అడ్డుకొని తీరుతామన్నారు.మా మాదిగల నిరసన సెగ,మా ఆవేదన,ఆగ్ర్రహం బీజేపీకి తెలియజేస్తామని,మా మాదిగల ఆవేదన అగ్రహాంగా మారకముందే ఇచ్చిన మాటకు కట్టుబడి ఎస్సీ ఏబీసీడీ వర్గీకరణ చేస్తామని ప్రకటన తీర్మానం చేయాలని హెచ్చరించారు.
సూర్యాపేట రూరల్ పోలీస్ వారు ముదస్తుగా జూన్ 30న తారీఖున రాత్రి 8 గంటలకు ఎమ్మార్పీఎస్ నాయకులను అరెస్టు చేయడం జరిగిందని,ఈ అరెస్టులతో ఉద్యమాన్ని ఆపలేరని,అరెస్ట్ అయినా కార్యకర్తల కంటే,మా ఎమ్మార్పీఎస్,ఎమ్మెస్పీ వేలాది శ్రేణులు,నాయకులు, కార్యకర్తలు నిరసన యుద్దానికి సిద్ధంగా ఉన్నారన్నారు.అరెస్టు అయిన వారిలో సూర్యాపేట జిల్లా ఎమ్మార్పీఎస్ నాయకులు గ్యార కనకయ్య మాదిగ,సూర్యాపేట మండల అధ్యక్షులు చెరుకుపల్లి చంద్రశేఖర్ మాదిగ,మండల నాయకులు కత్తుల విద్యాసాగర్ మాదిగ,దాసరి నతానియేల్ మాదిగ, సూరారపు యుగేందర్ మాదిగ,దాసరి వెంకన్న మాదిగ,బురుగుల శరత్ మాదిగ తదితరులు ఉన్నారని తెలిపారు.