సూర్యాపేట జిల్లా:సూర్యాపేట పట్టణంలో రోజురోజుకు జనాభా పెరుగుతూ ఉంటే, పెరుగుతున్న జనాభాతో పాటు క్రైమ్ కూడా పెరుగుతుంది.ఒక వైపు గంజాయి,మరోవైపు భూ పంచాయతీలు,ఇంకోవైపు భార్యభర్తల పంచాయితులు ,ఇవి కాకుండా జాతీయ రహదారిపై నిత్యం జరిగే ప్రమాదాలు,ఎస్కార్ట్లు,మంత్రి బందోబస్తు లాంటివి అదనపు బాధ్యతలు.
ఇవ్వన్నీటికి ఒక్కటే పరిష్కారం పట్టణంలో ఉన్న ఒకటే పోలీసు స్టేషన్.వన్ టౌన్,టూ టౌన్ అని ఉన్నప్పటికీ హౌస్ ఆఫీసర్ మాత్రమే ఒక్కరే.
అయినా పోలీసు స్టేషన్లో తగిన సిబ్బంది లేక ఉన్న సిబ్బందితోనే ఇబ్బందులు పడుతూ విధులు నిర్వహిస్తూ మానసిక ఒత్తిడికి గురి అవుతున్నారు.దీనితో వివిధ రకాల సమస్యలతో వచ్చిన ప్రజలు కూడా చాలా ఇబ్బందులకు గురి అవుతున్నారు.
పట్టణ ప్రజలకు పోలీస్ సేవలు అందుబాటులోకి తేవాలంటే వెంటనే టూ టౌన్ పోలీస్ స్టేషన్ కు వేరే బిల్డింగ్ ఏర్పాటు చేసి,అలాగే సిబ్బంది ని,సర్కిల్ ఇన్సెపెక్టర్ ను ఏర్పాటు చేసి ప్రజలకు సౌలభ్యంగ ఉండేలా చూడాలని పట్టణ ప్రజలు కోరుకుంటున్నారు.వెంటనే జిల్లా ఎస్పీ స్పందించి టూ టౌన్ పోలీస్ స్టేషన్ ఏర్పాటుకు తగు చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజల కోరుతున్నారు.