భార్యను దారుణంగా హతమార్చిన భర్త

సూర్యాపేట జిల్లా:చివ్వెంల మండలం బాధ్యతండ గ్రామపంచాయతీ పరిధిలోని సామ్య భూక్య తండాలో భార్యను దారుణం జరిగింది.గ్రామానికి చెందిన భూక్య సైదా(43) భార్య సక్కు(38)ను రోకలిబండతో తలపై కొట్టి హతమార్చి పరారయిన ఘటన సోమవారం తెల్లవారు జామున జరిగింది.

 A Husband Who Brutally Killed His Wife-TeluguStop.com

పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం,మద్యానికి బానిసైన భర్త సైదా నిత్యం తాగి వేధిస్తుండడంతో భార్య సక్కు మందలించింది.అప్పటికే మత్తులో ఉన్న భర్త విచక్షణ కోల్పోయి రోకలి బండతో ఆమె తలపై కొట్టి పరారయ్యాడు.

భార్య అక్కడిక్కడే కుప్పకూలి మరణించింది.వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.

మద్యం ఎన్ని కుటుంబాల్లో విషాదం నింపినా దానిని కట్టడి చేసే ప్రభుత్వాలకు పట్టకపోవడం గమనార్హం.ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube