భార్యను దారుణంగా హతమార్చిన భర్త
TeluguStop.com
సూర్యాపేట జిల్లా:చివ్వెంల మండలం బాధ్యతండ గ్రామపంచాయతీ పరిధిలోని సామ్య భూక్య తండాలో భార్యను దారుణం జరిగింది.
గ్రామానికి చెందిన భూక్య సైదా(43) భార్య సక్కు(38)ను రోకలిబండతో తలపై కొట్టి హతమార్చి పరారయిన ఘటన సోమవారం తెల్లవారు జామున జరిగింది.
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం,మద్యానికి బానిసైన భర్త సైదా నిత్యం తాగి వేధిస్తుండడంతో భార్య సక్కు మందలించింది.
అప్పటికే మత్తులో ఉన్న భర్త విచక్షణ కోల్పోయి రోకలి బండతో ఆమె తలపై కొట్టి పరారయ్యాడు.
భార్య అక్కడిక్కడే కుప్పకూలి మరణించింది.వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.
మద్యం ఎన్ని కుటుంబాల్లో విషాదం నింపినా దానిని కట్టడి చేసే ప్రభుత్వాలకు పట్టకపోవడం గమనార్హం.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
How Modern Technology Shapes The IGaming Experience