విక్టరీ వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి( Director Anil Ravipudi ) దర్శకత్వంలో వస్తున్న కొత్త సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.ఇక వీళ్ళ కాంబినేషన్ లో ఇంతకు ముందే వచ్చిన రెండు సినిమాలు సూపర్ సక్సెస్ అవడంతో ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలైతే ఉన్నాయి.
ఇక దానికి తగ్గట్టుగానే ఈ సినిమా ఎంతవరకు ప్రేక్షకుల మెప్పు పొందుతుంది అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలో వెంకటేష్ లెక్చరర్ గా నటించబోతున్నాడు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ఇక ఇప్పటివరకు వెంకటేశ్( Venkatesh ) ఇలాంటి పాత్రను పోషించలేదు.కాబట్టి ఈ పాత్రలో నవ్వులను పూయించబోతున్నట్టుగా కూడా వార్తలైతే వస్తున్నాయి.

ఇక ఇంతకు ముందు వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన ఎఫ్2, ఎఫ్3 సినిమాలను( F3 Movie ) మించి ఈ సినిమాలో కామెడీ ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది.అలాగే ఈ సినిమాకి దిల్ రాజు( Dil Raju ) ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నాడు.కాబట్టి చాలా గ్రాండ్ గా ఈ సినిమాని తెరకెక్కించే విధంగా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది.ఇక ఇది ఇలా ఉంటే ఈ సినిమా విషయంలో వెంకటేష్ కూడా అన్ని దగ్గరుండి చూసుకుంటున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఈ సినిమాలో హీరోయిన్ ఎవరు అనేది ఇంకా ఫైనలైజ్ చేయనప్పటికీ ఈ సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతి కి రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రి ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసిన ఈ సినిమా తొందరలోనే సెట్స్ మీదికి వెళ్లే ప్రణాళికలను రూపొందించుకుంటుంది.ఇక ఈ సినిమాతో వీళ్ళ కాంబినేషన్ లో హ్యాట్రిక్ హిట్స్ నమోదు అవ్వబోతున్నయని ఆటు అనిల్ రావి పూడి అభిమానులు, ఇటు వెంకటేష్ అభిమానులు మంచి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు… చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందో…
.







