సూర్యాపేట జిల్లా:హుజూర్ నగర్ మున్సిపాలిటీ 4వ,వార్డు పరిధిలో గత 14 ఏళ్లుగా నీటి పన్ను చెల్లించని ప్రభుత్వ ఉద్యోగి ఇంటికి నీటి సరఫరా చేస్తూ పన్ను చెల్లిస్తున్న ప్రజలకు 10 రోజులుగా నీటి సరఫరా నిలిపేసిన మున్సిపల్ సిబ్బంది తీరుపై వార్డు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
14 ఏళ్లుగా సదరు ప్రభుత్వ ఉద్యోగి నుండి నీటి పన్ను వసూలు చేయలేక వీధి మొత్తానికి నీటి సరఫరాను ఎలా ఆపుతారని ప్రశ్నిస్తున్నారు.ఈ విషయమై మున్సిపాలిటీ ఏఈని వివరణ కోరగా నాకు తెలియదంటూ నిర్లక్ష్యంగా సమాధానమివ్వడం గమనార్హం.దీనితో ప్రత్యేక అధికారుల పాలనలో కూడా మున్సిపల్ అధికారుల వైఖరి మారకపోవడం శోచనీయమని అసహనం వ్యక్తం చేస్తున్నారు.