సూర్యాపేట జిల్లా:పేరు గొప్ప ఊరు దిబ్బ అనే సామెతకు పక్కా ఉదాహరణగా చెప్పుకోవచ్చు సూర్యాపేట పట్టణాభివృద్ధిని చూస్తే.సూర్యాపేట నియోజకవర్గ టిఆర్ఎస్ నాయకులు పొద్దున లేస్తే అన్ని కోట్లు తెచ్చాం,ఇన్ని కోట్లు ఇచ్చాము అభివృద్ధి అంటే మాదే అని గొప్పలు చెప్పుకోవడం తప్ప,ఈ ఎనిమిది సంవత్సరాలలో అభివృద్ధి చేసింది మాత్రం శూన్యమని బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి సలిగంటి వీరేంద్ర విమర్శించారు.
సోమవారం పట్టణంలో జరుగుతున్న అభివృద్ధిపై ఆయన మాట్లాడుతూ ప్రతిపక్షాలు ఏమైనా మాట్లాడితే కలెక్టర్ ఆఫీస్,మెడికల్ కాలేజ్,ఇంటిగ్రేటెడ్ మార్కెట్,ఎస్పీ ఆఫీసు అని చెప్పుకోవడానికే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారని,ఎనకటికీ ఒక సామెత ఉండే చెప్పుకోని ఏడవ చూసుకొని మురవా అన్న చందంగా ఇక్కడ టీఆర్ఎస్ నాయకులకు మాటలు ఉన్నాయని ఎద్దేవా చేశారు.కొంతమంది టీఆర్ఎస్ నాయకులకు, అధికారులకు అక్రమాలు చేసి,అవినీతి చేసి డబ్బులు సంపాదించుకోవడంలో ఉన్న సోయి పట్టణంలోని నడిబొడ్డులో ఉన్న రాఘవ ప్లాజా దగ్గర ఈ సమస్యలు కనపడవా అని ప్రశ్నించారు.
ఇక్కడ ఉన్నదే ఇరుకు రోడ్డు అందులో మధ్యలో డివైడర్ ఏర్పాటు చేశారు.ఉన్న కాస్త ఇరుకు రోడ్డులో పెద్ద గొయ్యి ఏర్పడి వారం రోజులు అవుతున్నా ఏ ఒక్క అధికారి,ప్రజా ప్రతినిధి ఈ గొయ్యి చూసింది లేదు, దానిని పూడిచింది లేదని అన్నారు.
ఏదైనా సమస్య దృష్టికి తీసుకొని వస్తే ప్రతిపక్షాలు కాబట్టి అలానే మాట్లాడతారని,మరీ గట్టిగా మాట్లాడితే కేసులు పెట్టడం తప్ప చేసేది ఏమీ లేదని,ఈ గొయ్యి దగ్గరికి వచ్చేదాకా వాహనదారులకు కనపడటం లేదని, చూసుకోకుండా పోతే అందులో పడితే బతకడం చాలా కష్టమని,రాత్రి వేళ అయితే మహా ప్రమాదంగా ఉంటుందని,అభివృద్ధి భజన చేయడానికి కొంచెం అయినా సిగ్గు ఉండాలని ఘాటుగా స్పందించారు.ఆ గుంత చుట్టూ సేఫ్టీగా రాళ్లు పెట్టడం గానీ,రేడియం క్లాత్ కట్టడం గానీ చేయలేదని దీని వలన ప్రమాదాలు జరిగితే ఎవరు బాధ్యత వహించాలని ప్రశ్నించారు.
ఇలా చెప్పుకుంటూ పోతే సూర్యాపేట నియోజకవర్గంలో చాలా సమస్యలు ఉన్నాయని,ఒక సంవత్సరంలో ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు హడావుడిగా అభివృద్ధి చేస్తున్నట్లుగా పట్టణంలోని రోడ్లు వేస్తున్నట్లుగా నటిస్తున్నారని ఆరోపించారు.సూర్యాపేట నియోజకవర్గ ప్రజలు అసమర్థులు, తెలివితేటలు లేని వాళ్ళు,చైతన్యవంతులు కాదనుకోని భ్రమలో ఉండి,నచ్చినట్టుగా చేసుకుంటూ పోతామని, ప్రశ్నించిన వాళ్లను జైళ్లకు పంపుతామని అనుకోవడం మూర్ఖత్వమని తెలిపారు.
నియోజకవర్గ ప్రజలు అవకాశం కోసం చూస్తున్నారని,అవకాశం వచ్చినప్పుడు ఈ టిఆర్ఎస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పడం ఖాయమని అన్నారు.