న్యూస్ రౌండప్ టాప్ 20

1.నేడు ఏపీకి ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి

 

 Telangana Headlines, News Roundup, Top20news, Telugu News Headlines, Todays Gold-TeluguStop.com
Telugu Apcm, Cm Kcr, Corona, Draupadi Murmu, Harish Rao, Karthikeya, Kgbv School

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఈరోజు ఏపీలో పర్యటించనున్నారు.మధ్యాహ్నం మూడు గంటలకు విజయవాడ చేరుకుంటారు.ఈ సందర్భంగా వైసీపీ ఎమ్మెల్యేలు ,ఎంపీలతో ఆమె సమావేశం అవుతారు. 

2.సెప్టెంబర్ 27 నుంచి శ్రీవారి బ్రహ్మోత్సవాలు

 

Telugu Apcm, Cm Kcr, Corona, Draupadi Murmu, Harish Rao, Karthikeya, Kgbv School

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవ వేడుకలను సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5 వరకు నిర్వహించనున్నట్లు టిటిడి పాలకమండలి నిర్ణయించింది. 

3.  పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు

  జూలై 18 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 

4.భారత్ లో కరోనా

 

Telugu Apcm, Cm Kcr, Corona, Draupadi Murmu, Harish Rao, Karthikeya, Kgbv School

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా కొత్తగా 13,615 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

5.వరవరరావు బెయిల్ ను మరోసారి పొడగించిన సుప్రీం

 విరసం నేత వరవరరావు మెడికల్ బెయిల్ పిటిషన్ పై విచారణను సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది.

బెయిల్ పిటిషన్ గడువు ముగియడంతో ఈరోజు సాయంత్రం లొంగిపోవాల్సి ఉంది.అయితే ఈ బెయిల్ ను ఈనెల 19 వరకు పొడిగిస్తూ సుప్రీం కోర్టు నిర్ణయం తీసుకుంది. 

6.రాగల మూడు రోజులపాటు అతి భారీ వర్షాలు

 

Telugu Apcm, Cm Kcr, Corona, Draupadi Murmu, Harish Rao, Karthikeya, Kgbv School

తెలంగాణలో రాగల మూడు రోజులు వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ పేర్కొంది. 

7.కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి తో జగన్ వీడియో కాన్ఫరెన్స్

  ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేందర్ సింగ్ తోమర్ తో ఏపీ సీఎం జగన్ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో వర్చువల్ గా సమావేశం అయ్యారు. 

8.సీఐ నాగేశ్వరావు కేసులో కీలక ఆధారాలు సేకరించి న సిట్

 

Telugu Apcm, Cm Kcr, Corona, Draupadi Murmu, Harish Rao, Karthikeya, Kgbv School

సిఐ నాగేశ్వరరావు కేసులో సీట్ కీలక ఆధారాలు సేకరించింది.ప్రాథమిక దర్యాప్తులో నేరం రుజువైందని సిట్ తేల్చింది.కిడ్నాప్ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. 

9.నిలిచిపోయిన యూరియా ఉత్పత్తి

  భారీ వర్షం కారణంగా రామగుండం ఎరువుల కర్మాగారంలో యూరియా ఉత్పత్తి నిలిచిపోయింది. 

10.ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉండాలి : హరీష్ రావు

 

Telugu Apcm, Cm Kcr, Corona, Draupadi Murmu, Harish Rao, Karthikeya, Kgbv School

రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ పూర్తి అప్రమత్తంగా ఉండాలని ఆ శాఖ మంత్రి హరీష్ రావు ఆదేశించారు. 

11.షెడ్యూల్ ప్రకారం ఎంసెట్

  ఎంసెట్ ప్రవేశ పరీక్షను షెడ్యూల్ ప్రకారం నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు ఈనెల 14వ తేదీ నుంచి ఎంసెట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. 

12.గ్రూప్ వన్ అభ్యర్థులకు ఎడిట్ ఆప్షన్

 

Telugu Apcm, Cm Kcr, Corona, Draupadi Murmu, Harish Rao, Karthikeya, Kgbv School

గ్రూప్ వన్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఎడిట్ ఆప్షన్ అందుబాటులోకి వచ్చింది.దరఖాస్తు చేసిన సమయంలో జరిగిన పొరపాట్లు సరిదిద్దుకోవడానికి అవకాశం కల్పించారు. 

13.కెసిఆర్ పై కాంగ్రెస్ నేతల విమర్శలు

  ఎన్నికల  తేదిని చెబితే అసెంబ్లీని రద్దు చేస్తామంటున్న సీఎం కేసీఆర్ కు దమ్ముంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్లాలని భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి సవాల్ విసిరారు. 

14.ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శి కి నాన్ బెయిలబుల్ వారెంట్

 

Telugu Apcm, Cm Kcr, Corona, Draupadi Murmu, Harish Rao, Karthikeya, Kgbv School

ఏపీ ఆర్థిక శాఖ కార్యదర్శి సత్యనారాయణకు హైకోర్టు నాన్ బెయిలబుల్  వారెంట్ జారీ చేసింది.విద్యాశాఖ బిల్లులు చెల్లింపు అంశంపై ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. 

15.రాజధాని పిటిషన్ పై హైకోర్టులో విచారణ

 ఏపీ రాజధాని అమరావతి పిటిషన్లపై హైకోర్టులు విచారణ జరిగింది.

రాజధాని పనుల పురోగతిపై ఏపీ ప్రభుత్వం స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేసింది.తాము మరో కోర్టు ధిక్కార పిటిషన్ వేసామని రైతుల తరపు న్యాయవాది మురళీధర్ కోర్టుకు వెల్లడించారు. 

16.అన్నవరం ఆలయ సూపర్ వైజర్ల కు నోటీసులు

  అన్నవరం దేవస్థాన వ్రత పురోహితుల సూపర్ విజర్లకు ఆలయ ఈవో నోటీసులు ఇచ్చారు.

తొలి ఏకాదశి రోజున పురోహితులు కలశం లేకుండా ఆలయంలో పూజలు నిర్వహించారు.ఈ విషయంపై ఫిర్యాదులు రావడంతో ఈవో సూపర్వైజర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ నోటీసులు జారీ చేశారు. 

17.కేజీబీవీలో బదిలీలకు గ్రీన్ సిగ్నల్

 

Telugu Apcm, Cm Kcr, Corona, Draupadi Murmu, Harish Rao, Karthikeya, Kgbv School

కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో బోధనా సిబ్బంది బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

18.కార్తికేయ 2 సినిమా విడుదల వాయిదా

 హీరో నిఖిల్, దర్శకుడు చందు మొండేటి కాంబినేషన్ లో తెరకెక్కిన కార్తికేయ 2 సినిమా ఈ నెల 22వ తేదీన విడుదల కావలసి ఉన్నా.అని వార్య కారణాల వల్ల సినిమా రిలీజ్ డేట్ వాయిదా పడినట్లు హీరో నిఖిల్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. 

19.నేటి నుంచి సింహాచలంలో గిరి ప్రదక్షిణలు

 

Telugu Apcm, Cm Kcr, Corona, Draupadi Murmu, Harish Rao, Karthikeya, Kgbv School

ఆషాడ పౌర్ణమిని పురస్కరించుకుని సింహాచలం పుణ్యక్షేత్రంలో నేటి నుంచి సింహగిరి ప్రదక్షిణలు జరగనున్నాయి.ఈ సందర్భంగా కొండచుట్టు 32 కిలోమీటర్ల మేర భక్తులు ప్రదక్షిణ చేస్తారు. 

20.నెలరోజుల్లో స్క్రీనింగ్ కమిటీ నియామకం

  నెల రోజుల్లో కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ నియామకం చేపడతామని తెలంగాణ కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube