సాధారణంగా కొందరి జుట్టు( Hair ) అస్సలు ఎదగదు.ఈ విషయంలో చాలా హైరానా పడిపోతూ ఉంటారు.
అయితే జుట్టు ఎదగక పోవడానికి కారణాలు అనేకం.పోషకాల కొరత, ఒత్తిడి, ఆహారపు అలవాట్లు తదితర కారణాల వల్ల జుట్టు ఎదగడం ఆగిపోతుంటుంది.
ఇలా మీకు జరిగితే ఖచ్చితంగా ఇప్పుడు చెప్పబోయే విషయాలు తెలుసుకోండి.జుట్టు ఎదగడం లేదు అంటే ప్రోటీన్, ఐరన్, విటమిన్ ఇ వంటి పోషకాలు నిండుగా ఉండే ఆహారాలను డైట్ లో చేర్చుకోండి.
అలాగే ఒత్తిడికి దూరంగా ఉండండి.ధూమపానం, మద్యపానం అలవాట్లను వదులుకోండి.

వీటితో పాటు ఇప్పుడు చెప్పబోయే హెయిర్ ప్యాక్( Hair Pack ) ను వారానికి ఒకసారి తప్పకుండా ప్రయత్నించండి.ఈ హెయిర్ ప్యాక్ మీ జుట్టు ఎదుగుదలకు అద్భుతంగా తోడ్పడుతుంది.అందుకోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ వాటర్ పోయాలి.వాటర్ హీట్ అవ్వగానే అందులో రెండు టేబుల్ స్పూన్లు అవిసె గింజలు( Flax Seeds ) మరియు నాలుగు లవంగాలు వేసి బాగా ఉడికించాలి.
జెల్లీ స్ట్రక్చర్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.ఇది పూర్తిగా ఆరిన తర్వాత పల్చటి వస్త్రం సహాయంతో జెల్ ను సపరేట్ చేసుకోవాలి.
ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో అవిసె గింజల జెల్ వేసుకోవాలి.అలాగే వన్ టేబుల్ స్పూన్ కరివేపాకు పౌడర్( Curry leaves Powder ), వన్ టేబుల్ స్పూన్ ఆమ్లా పౌడర్, వన్ టేబుల్ స్పూన్ మందారం పౌడర్( Hibiscus Powder ), వన్ టేబుల్ స్పూన్ ఆముదం వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి.
ఇలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.

గంట లేదా గంటన్నర అనంతరం మైల్డ్ షాంపూ ను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒక్కసారి ఈ రెమెడీని పాటిస్తే హెయిర్ గ్రోత్ చక్కగా ఇంప్రూవ్ అవుతుంది.కొద్ది రోజుల్లోనే మీ జుట్టు ఒత్తుగా పొడుగ్గా( Long Hair tips ) ఎదుగుతుంది.
జుట్టు రాలడం కంట్రోల్ అవుతుంది.మరియు కురులు త్వరగా తెల్ల పడకుండా సైతం ఉంటాయి.
కాబట్టి జుట్టు ఎదగడం లేదని బాధపడుతున్న వారు ఈ హెయిర్ ప్యాక్ ను తప్పకుండా ప్రయత్నించండి.








