చిన్నాపెద్దా తేడా లేకుండా ఇంటిల్లిపాదీ ఆస్వాదించే పండుగ దీపావళి.తమ జీవితంలో అమావాస్య చీకట్లను పారదోలి వెలుగు జిలుగులు నింపుకునే సంతోషాల వేడుక ఇది.
ఈ తరంలో చాలామంది దీపావళి అంటే ఒక్కరోజు జరుపుకునే పండగ అనుకుంటారు.నిజానికిది ఐదురోజులు జరుపుకొనే ఉత్సవం.
ధన త్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి అమావాస్య, బలి పాడ్యమి, భగిని హస్త భోజనం (భాయిదూజ్)గా జరుపుకుంటారు.దీపావళినాడు దీపలక్ష్మి తన కిరణాల్తో జగత్తునంతటినీ కాంతమయం చేస్తుంది.
దీపలక్ష్మికి భక్తిశ్రద్ధలతో నమస్కరిస్తే సకల సంపదలూ ఒనగూరుతాయి.దీపకాంతిని త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీకగా పేర్కొంటారు.

త్రయోదశి:
ఓ రాణి తపన.హిమ రాజు కుమారుడి జాతకంలో పెళ్లయిన నాలుగవ రోజునే మరణం రాసిపెట్టి ఉంది.అదీ…పాము కాటు రూపంలో.పదహారేళ్ల వయసులో అతడికి పెళ్లెంది.నాలుగోరోజు రానే వచ్చింది.విషయం తెలిసిన ఆయన భార్య ఆరోజున నిద్రించలేదు.
భర్తనూ నిద్రపోనివ్వలేదు.

ఆ గదిలో తన ఆభరణాలన్నిటినీ రాశిగా పోసి, చుట్టూ లక్షల దీపాలు వెలిగించింది.ఆ వెలుగులో తన పతికి కథలు చెబుతూ పాటలు పాడుతూ గడిపింది.రాత్రివేళ మృత్యుదేవత సర్పరూపంలో వచ్చింది.
ఆ వెలుగులకు కళ్లు మనకేశాయి.ఆభరణాల మీద కూర్చుని రాత్రంతా ఆమె పాడిన పాటలు విని.
యువరాజును కరవకుండానే వెళ్లిపోయింది.యువరాజుకు గండం తప్పినరోజు ఆశ్వీయుజమాసంలోని 13వ రోజు కనక ‘ధనత్రయోదశిగా లేక యమదీప దానంగా పిలుస్తూ.
మృత్యుదేవతను తమ ఇంటికి రానివ్వకుండా దీపాలు వెలిగిగిస్తున్నారు.
నరక చతుర్దశి
లోక కంటకుడైన నరకాసుర సంహారం జరిగిన రోజు కాబట్టి ఇళ్లనూ, వాకిళ్లనూ అలంకరించి పూజలు చేస్తారు.
ఉదయాన్నే ఇల్లంతా కడిగి ముగ్గులు పెట్టాలి.ఆ రోజు పరిశుభ్రంగా లేని ఇంట్లో ఏడాదంతా దరిద్రం తాండవిస్తుందని ప్రజల నమ్మకం.ఈ రోజు స్వాతీ నక్షత్రం ఉన్నప్పుడు నీటిలో గంగాదేవీ, నువ్వుల నూనెలో లక్ష్మీదేవి కొలువై ఉంటారు.అందుకే నువ్వుల నూనెతో తలంటుకొని స్నానం చేయాలి.
విష్ణుమూర్తి బాలవటువు రూపంలో మూడు అడుగుల నేల అడిగి బలి చక్రవర్తిని పాతాళానికి అణిచేసిన రోజు కూడా ఇదేనని చెబుతారు.

దీపావళి
ఆశ్వయుజ బహుళ అమావాస్య రోజును దీపావళిగా ప్రజలు జరుపుకొంటారు.రాష్ట్రాల వారీగా సంప్రదాయాల్లో వ్యత్యాసాలు ఉన్నప్పటికీ, ఒకే స్థాయి ఉల్లాస, ఉత్సాహాలతో నిర్వహించే వేడుక ఇది.ఈ రోజు ఏ ఇంట దీపాలు వెలుగుతాయో ఆ ఇంట మహాలక్ష్మి ప్రవేశిస్తుందన్న విశ్వాసం ఉంది.అందుకే దీపాల వరుసలతో ఆమెకు స్వాగతం పలుకుతారు.ఇల్లంతా దీపాలతో అలంకరిస్తే, ఇంట ఆమె కొలువై ఉంటుందని నమ్మకం.సాయంత్రం లక్ష్మీరూపమైన తులసికోట ముందు ముందుగా దీపాలు వెలిగిస్తారు.తరువాత శ్రీమహాలక్ష్మిని పూజిస్తారు.
తరువాత పిల్లలూ, పెద్దలూ బాణాసంచా కాలుస్తూ దీపావళిని జరుపుకొంటారు.
బలి పాడ్యమి
బలి చక్రవర్తి తన శక్తితో అందరినీ జయించి దేవతలకు ముప్పుగా మారాడు.
అతడిని నియంత్రించడానికి విష్ణువ్ఞ వామనుడి రూపంలో వచ్చాడు.దానాల్లో వెనక్కి తగ్గని బలిని మూడడుగుల నేల మాత్రం అడగటం తొలి రెండడుగులతో భూమ్యాకాశాలను ఆక్రమించటం…మూడో అడుగు బలి శిరస్సుపై పెట్టడం తెలిసిందే.
దాంతో పాతాళానికి వెళ్లిపోయిన బలిని విష్ణువ్ఞ కరుణించాడు.బలికి జ్ఞానదీపాన్నిచ్చి.
ఏడాదికోసారి భూమ్మీదకి రావటానికి అనుమతించాడు.తద్వారా ఆ జ్ఞాన దీపంతో అజ్ఞాన చీకట్లను తరిమేయటానికి వీలు కల్పించాడు.

అదే విధంగా శ్రీకృష్ణుడు గోవర్ధన గిరిని ఎత్తి నందగోకులాన్ని కాపాడిన రోజు ఇదేనని పురాణాలు చెబుతున్నాయి.ఈ రోజు గోవర్ధన పూజ చేసే ఆనవాయితీ కొన్ని ప్రాంతాల్లో ఉంది.ఇంట్లో ఆవు పేడను కొండ ఆకారంలో తీర్చి, పూజిస్తారు.దానికి నైవేద్యాలు సమర్పిస్తారు.ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మథుర జిల్లాలో ఉన్న గోవర్ధన గిరి పరిక్రమను ఈ రోజుల్లో చెయ్యడం పవిత్రంగా భావిస్తారు.గోవర్ధన గిరి చుట్టూ సుమారు 23 కి.మీ.మేర సాగే ఈ పరిక్రమలో వేలాది భక్తులు పాల్గొంటారు.గుజరాతీయుల నూతన సంవత్సరం ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది.వారు దీన్ని ‘బెస్తు వర్ష్’ అంటారు.
భగిని హస్త భోజనం

ఈ రోజును యమ ద్వితీయ, భాయిదూజ్గా జరుపుకుంటారు.యవరాజు ఆ రోజున తన సోదరి యమి ఇంటికి వెళ్లాడు.ఆమె అతడి నుదుటిపై పవిత్ర తిలకం దిద్దింది.పూలమాల వేసి ప్రత్యేక వంటలు వడ్డించింది.ఇద్దరూ మిఠాయిలు తిన్నారు.యమరాజు వెళ్లిపోతూ తన సోదరికి ఓ వరమిచ్చాడు.
ఆ ప్రత్యేక రోజున యమిని ఎవరు సందర్శిస్తే వారి పాపాలన్ని పోతాయని, మోక్షం కలుగుతుందని చెప్పాడు.నాటి నుంచీ ఆ రోజును సోదర-సోదరీమణుల ప్రేమ చిహ్నంగా భావిస్తూ పండుగ చేసుకుంటున్నారు.
హిందీ ప్రాంతాల్లో ఆ పండుగను ‘భయ్యా-దుజ్గా మరాఠీ మాట్లాడే ప్రాంతాల్లో నేపాల్లో దీన్ని ‘భాయి-టికాగా పాటిస్తున్నారు.