ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

సూర్యాపేట జిల్లా:తుంగతుర్తి నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి మండలం తొండ గ్రామంలో ఏర్పాటు చేసిన ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తుంగతుర్తి శాసనసభ్యులు డా.గాదరి కిశోర్ కుమార్ ప్రారంభించారు.

 Mla Who Opened A Grain Buying Center-TeluguStop.com

ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా మన తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం రైతులు పండించిన ప్రతీ ధాన్యపు గింజను కొనుగోలు చేస్తుందన్నారు.కేంద్ర బీజేపీ ప్రభుత్వం రైతులు పండించిన ధాన్యాన్ని కొనమని చెప్పినా,ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయాన రైతు కాబట్టి,తెలంగాణ రైతులకు ఎటువంటి నష్టం జరకూడదని రైతులు పండించిన ప్రతీ గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రకటించారని చెప్పారు.యాసంగి పంటను ప్రభుత్వమే కొనుగోలు చేస్తూ,రైతులు దళారులకు తక్కువ ధరకు అమ్ముకుని నష్టపోకూడదని ప్రభుత్వం ఏ గ్రేడ్ ధాన్యానికి రూ.1960/-లకు,కామన్ గ్రేడ్ రూ.1940/లకు కొనుగోలు చేస్తుందని తెలిపారు.రైతులు ధాన్యాన్ని శుభ్రం చేసి తాలు,పొల్లు లేకుండా కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు,అధికారులు,టీఆర్ఎస్ నాయకులు, ఐకేపీ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube