సూర్యాపేట జిల్లా:పెంచిన ఆర్టీసీ చార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు నెమ్మాది వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు.మంగళవారం సిపిఎం సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం పెంచిన ఆర్టీసీ చార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా కేంద్రంలోని నల్లాల బావి సెంటర్ లో రాస్తారోకో నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీ నష్టాలకు ప్రజలు కారణం కాదని యాజమాన్యమే ఆర్టీసీ నష్టాలకు కారణమని అన్నారు.ఆర్టీసీని ప్రైవేటు పరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు.
లాభాలు వచ్చే రూట్ ల లో ప్రైవేటు సంస్థలకు ఇస్తూ నష్టాలు వచ్చే గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీసీ బస్సులను నడుపుతున్నారని దీనికి యాజమాన్యం మే ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.ఆర్టీసీకి నష్టాలు వస్తున్నాయని పేరుతో చార్జీలు పెంచడం సబబు కాదన్నారు.
ప్రపంచ బ్యాంకు షరతులకు లోబడి ఆర్టీసీని 7 కార్పొరేషన్ లుగా విభజించాలని నిర్ణయించారని అన్నారు.దీని మూలంగా బస్సుల సంఖ్యతో పాటు 20 శాతం సిబ్బంది తగ్గిపోతున్నారని అన్నారు.
గత కాంగ్రెస్, టిడిపి ప్రభుత్వాలు అనుసరించిన విధానాలనే నేడు టిఆర్ఎస్ ప్రభుత్వం అనుసరిస్తుదని ఆరోపించారు.తెలంగాణ వచ్చినప్పుడు 55,000 మంది కార్మికులు ఉంటే నేడు 44 వేల మంది మాత్రమే కార్మికులు ఆర్టీసీలో పని చేస్తున్నారని అన్నారు.
తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన ఆర్టీసీ చార్జీలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.లేనియెడల సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు మట్టిపెల్లి సైదులు, మేకనబోయిన శేఖర్,జిల్లపల్లి నరసింహారావు, చిన్నపంగ నరసయ్య,వీరబోయిన రవి,పట్టణ నాయకులు మామిడి సుందరయ్య,దేవరకొండ యాదగిరి తదితరులు పాల్గొన్నారు.