టాలీవుడ్ లో మెహ్రీన్ కౌర్ నాని కృష్ణ గాడి వీర ప్రేమ గాధ సినిమా తో ఎంట్రీ ఇచ్చింది.అతి తక్కువ సమయం లోనే మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుని వరస అవకాశాలు అనుకుంటుంది.
తెలుగు లోనే కాకుండా మిగతా భాషల్లో కూడా అడపా దడపా సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది.అయితే ఈమె తాజాగా ఒక పోస్ట్ చేసింది.
అది కాస్త ఇప్పుడు నెట్టింట వైరల్ అయ్యింది.
ఈమె నటీనటుల విషయంపై సోషల్ మీడియా వేదికగా పోస్ట్ షేర్ చేసింది.
అందరికి తెలిసిన సినీ జీవితం వేరు.దగ్గరగా చూసేది వేరు.
అందరికి ఇది అద్భుతమైన ప్రపంచం ఏమీ కాదు.మా సినీ తారల జీవితాలు చాలా విచిత్రంగా ఉంటాయి సినిమాల్లో అందంగా మంచి లుక్ లో ఉండేలా కనిపించాలంటే కఠినమైన శిక్షణ తీసుకోవాల్సి వస్తుంది.
ఎలాంటి పరిస్థితుల్లో అయినా షూటింగ్ చేయాల్సి వస్తుంది.

రాత్రికి రాత్రే మా జీవితాలు మారిపోతాయి.సక్సెస్ దక్కిందని ఆనందించే లోపే ఫెయిల్యూర్ ఎదురు చూస్తూ ఉంటుంది.వాతావరణ పరిస్థితులను లెక్కచేయకుండా షూట్ చేయడం వల్ల ఆరోగ్యపరంగా కూడా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఈ సినిమాల వల్ల కుటుంబ సబ్యులకు, స్నేహితులకు కూడా దూరంగా ఉండాల్సి వస్తుంది.ఇవ్వన్నీ తెలిసిన కూడా ఇదే రంగాన్ని ఎంచుకుంటాం.అంటూ మెహ్రీన్ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.

ఇది ఇలా ఉండగా మెహ్రీన్ ప్రస్తుతం F3 సినిమా లో నటిస్తుంది.ఈ సినిమాలో వెంకటేష్, వరుణ్ తేజ్ లు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.ఈ సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతుంది.
సినిమాలో మెహ్రీన్ తో పాటు తమన్నా కూడా హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా ను దిల్ రాజు నిర్మిస్తున్నారు.







