గత కొన్నేళ్లుగా నయనతార విఘ్నేష్ శివన్ ప్రేమలో ఉన్నారనే సంగతి తెలిసిందే.సాధారణంగా నయనతార ఇంటర్వ్యూలు ఇవ్వడానికి పెద్దగా ఆసక్తి చూపరు.
అయితే విఘ్నేష్ శివన్ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలకు సంబంధించి నయనతార ప్రమోషన్స్ లో పాల్గొంటారు.విజయ సేతుపతి, నయనతార, సమంత హీరోహీరోయిన్లుగా విఘ్నేష్ శివన్ డైరెక్షన్ లో తెరకెక్కిన కాతువాక్కుల రెండు కాదల్ ఏప్రిల్ 28వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.
కణ్మని రాంబో ఖతీజా పేరుతో ఈ సినిమా తెలుగులో రిలీజ్ కానుండగా ఈ టైటిల్ విషయంలో నెటిజన్ల నుంచి నెగిటివ్ కామెంట్లు వినిపించాయి.అయితే నయనతార విఘ్నేష్ శివన్ లకు ఇంకా పెళ్లి కాలేదనే సంగతి తెలిసిందే.
ఆర్థికంగా స్థిరపడ్డ తర్వాతే పెళ్లి చేసుకుంటానని నయనతార కొన్ని నెలల క్రితం కీలక ప్రకటన చేశారు.అయితే నయనతార సంతానం విషయంలో సంచలన నిర్ణయం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది.
సరోగసి ద్వారా పిల్లల్ని కనాలని నయనతార విఘ్నేష్ శివన్ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది.

చెన్నైలో పిల్లల కోసం ఈ దంపతులు పూజలు కూడా చేశారని తెలుస్తోంది.అయితే కోలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తున్న ఈ వార్త గురించి నయన్ విఘ్నేష్ ఏ విధంగా స్పందిస్తారో చూడాల్సి ఉంది.నయనతార సాధారణంగా తనపై వచ్చే రూమర్ల గురించి క్లారిటీ ఇవ్వడానికి ఆసక్తి చూపరు.

అయితే సినిమాసినిమాకు నయనతారకు క్రేజ్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు.ఒక్కో సినిమాకు 5 కోట్ల రూపాయల స్థాయిలో నయన్ రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు.సౌత్ ఇండియాలో ఈ స్థాయిలో పారితోషికం తీసుకుంటున్న ఏకైక హీరోయిన్ నయనతార కావడం గమనార్హం.నయనతారకు తెలుగులో కూడా భారీస్థాయిలో ఆఫర్లు వస్తుండటం గమనార్హం.కథ, పాత్ర, హీరో, రెమ్యునరేషన్ ను బట్టి నయనతార సినిమాలను ఎంపిక చేసుకుంటున్నారు.







