సూర్యాపేట జిల్లా:జిల్లాలో రైతులు వానాకాలం పంటసాగుకు సిద్ధమౌతున్నందున నకిలీ విత్తనాలు, ఎరువులపై నిఘా పెంచాలని వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి ఆదేశించారు.
సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమంలో అదనపు కలెక్టర్ యస్.మోహన్ రావుతో కలసి అర్జీదారులు నుండి దరఖాస్తులను స్వీకరించారు.ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వానాకాలం పంటలకు రైతులు సిద్ధమౌతున్నందున నకిలీ విత్తనాలు,ఎరువులు దళారుల నుండి కొనుగోలు చేసి మోసపోకుండా వ్యవసాయ,రెవెన్యూ,పొలీస్ శాఖలు నిఘా పెంచి తద్వారా కేసులు నమోదు చేయాలని అన్నారు.అన్ని ఫెర్టిలేజర్ షాపులలో తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు.
వేసవి దృష్ట్యా అన్ని గ్రామాలలో ఎక్కడ కూడా త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా సంబంధిత శాఖ అధికారులు నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.అదేవిధంగా వేసవిలో ఉష్ణోగ్రతలు దృష్ట్యా జ్వరాలు,ఇతర జబ్బులకు అన్ని పి.హెచ్.సి.లలో మందులతో పాటు వైద్యాధికారులు అందుబాటులో ఉండాలని సూచించారు.వచ్చే హరితహారంలో భాగంగా జిల్లాలో విరివిగా మొక్కలు నాటేందుకు నర్సరీలలో మొక్కలను సిద్ధంగా ఉంచాలని అలాగే మొక్కల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు గ్రామీణ ప్రాంతాలలో ఎండ తీవ్రత వలన వడదెబ్బ నివారణకై ముందస్తుగా టీఎస్ఎస్ కళా బృంద సభ్యులు ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు.దరఖాస్తుదారులకు ధరణి వెబ్ సైట్ నందు భూమి యొక్క స్థితిగతులను ఎప్పయికప్పుఫు వివరించడంతో పాటు,తద్వారా సత్వరమే అర్జీదారుల సమస్యలు పరిష్కరం అవుతున్నవని అన్నారు.
ప్రజావాణిలో భూ సమస్యలపై 23,ఇతర శాఖలకు సంబంధించి 21 మొత్తం 44 దరఖాస్తులు అందాయని అన్నారు.ఈ కార్యక్రమంలో సంక్షేమ అధికారులు జ్యోతి పద్మ, అనసూర్య,శంకర్,పర్యవేక్షకులు సుదర్శన్ రెడ్డి,పులి సైదులు,అర్జీదారులు,అధికారులు తదితరులు పాల్గొన్నారు.