ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల ఫస్ట్ లెవెల్ చెకింగ్ పూర్తి:అదనపు కలెక్టర్ సిహెచ్ ప్రియాంక

సూర్యాపేట జిల్లా:సమీకృత జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సమీపంలోని ఇవీఎం గోడౌన్ లో జరుగుతున్న ఎలక్ట్రానిక్ యంత్రాల మొదటి లెవెల్ చెకింగ్ పూర్తి అయిందని, గురువారం వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో మాక్ పోల్ నిర్వహించబడుతుందని ఆదనపు కలెక్టర్ సిహెచ్.

ప్రియాంక( Collector Ch.

Priyanka ) తెలిపారు.ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రానున్న పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో బ్యాలెట్ యూనిట్లు 2803,కంట్రోల్ యూనిట్లు 1742,వివి పాట్లు 1848,మొదటి లెవెల్ చెకింగ్ పూర్తి చేయడం జరిగిందన్నారు.

ఈసీఐఎల్ ఇంజనీర్ల బృందం ఆధ్వర్యంలో ఫస్ట్ లెవెల్ చెకింగ్ ప్రక్రియ బుధవారానికి ముగిసిందన్నారు.గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలు,ప్రజల సమక్షంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల( Electronic voting machines ) పనితీరును ప్రయోగాత్మకంగా పరిశీలించేందుకు వీలుగా ర్యాండమ్ పద్ధతిన మాక్ పోల్ గురువారం నిర్వహించడం జరుగుతుందన్నారు.

ఈ కార్యక్రమంలో ఎన్నికల సూపర్డెంట్ శ్రీనివాసరాజు( Election Superintendent Srinivasa Raju ), డిటి వేణు సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
తెలంగాణ టెన్త్ ఫ‌లితాలు విడుద‌ల‌... సూర్యాపేటకు 6వ స్థానం

Latest Suryapet News