పోలింగ్ సిబ్బంది వివరాలు పక్కాగా నమోదు చేయండి

రాజన్న సిరిసిల్ల జిల్లా:ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది వివరాలు పక్కాగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి( Anuraga Jayanthi ) ఆదేశించారు.బుధవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కంట్రోల్ రూమ్ లో జిల్లాలో ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది వివరాలను ఆన్ లైన్ లో నమోదు చేసే తీరును అదనపు కలెక్టర్ పి.

 Enter The Polling Staff Details Accurately-TeluguStop.com

గౌతమి ( Additional Collecter Goutami )తో కలిసి కలెక్టర్ పరిశీలించి,అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు.ఎన్నికల ప్రక్రియలో సిబ్బందికి విధులు కేటాయించేందుకు వీలుగా అన్ని వివరాలు సక్రమంగా ఆన్ లైన్ లో నమోదు చేయాలని అన్నారు.

వివరాలు నమోదు చేసే సమయంలో ఏమైనా సందేహాలు ఉంటే వెంటనే నివృత్తి చేసుకోవాలని వివరాలు నమోదు చేస్తున్న సిబ్బందికి కలెక్టర్ సూచించారు.ఈ నమోదు ఆధారంగా విధులు కేటాయింపుతో పాటు పోస్టల్ బ్యాలెట్ కూడా అందజేయడం జరుగుతుందని తెలిపారు.

నమూనా ఈవీఎం, వీవీ ప్యాట్( EVM, VV Pat ) సందర్శనజిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో ఏర్పాటు చేసిన నమూనా ఈవీఎం, వీవీ ప్యాట్ లను అదనపు కలెక్టర్ పి.గౌతమి తో కలిసి జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి సందర్శించారు.ఈవీఎంలో ఓటు వేసే విధానాన్ని పరిశీలించారు.అనంతరం రిజిస్టర్ ను తనిఖీ చేశారు.వివరాలు నమోదు చేస్తున్నారా? లేదా అనే విషయాలను ఆరా తీశారు.ఓటు వేసే విధానం, వీవీ ప్యాట్ పై అందరికీ అవగాహన కల్పించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో డీఈఓ రమేష్ కుమార్, కలెక్టరేట్ ఏఓ రాంరెడ్డి, ఈ-డిస్ట్రిక్ మేనేజర్ శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube