సూర్యాపేట జిల్లా:చిలుకూరు పోలీస్ స్టేషన్ కు ఓ వ్యక్తిని విచారణ కోసం పిలిచిన ఎస్సై శ్రీనివాస్ యాదవ్ అతనిపై చెయ్యి చేసుకున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.దీనితో స్పందించిన చిలుకూరు ఎస్ఐ శ్రీనివాస్ యాదవ్ అతను అమర్యాదగా మాట్లాడటం వల్లనే చెయ్యి చేసుకున్నట్లు తెలిపినట్లు సమాచారం.
కేసు ఏమిటి, అతను ఎందుకు అమర్యాదగా మాట్లాడాల్సివచ్చింది, ఎస్ఐ చెయ్యి చేసుకునే పరిస్థితి ఎందుకొచ్చిందనేది తెలియాల్సి ఉంది.