కోనో కార్పస్ మొక్కలు విషపు కోరలేనా?

సూర్యాపేట జిల్లా:తెలంగాణలో గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లో ఓ మొక్కపై ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.ఆ మొక్క కూడా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా కోట్ల రూపాయల ప్రజా ధనాన్ని వెచ్చించి రాష్ట్ర వ్యాప్తంగా నాటించిన కోనో కార్పస్ మొక్కలు కావడం గమనార్హం.

 Are Kono Corpus Plants Poisonous?-TeluguStop.com

ఉన్నట్లుండి కోనో కార్పస్ మొక్కలు విషాన్ని వెదజల్లుతూ శ్వాసకోస సమస్యలకు కారణమవుతుందని ఇటీవల వివిధ టీవీ ఛానల్స్,పత్రికల్లో నిపుణుల చర్చలు చేస్తున్నారు.ఇంతటి ప్రమాదకరమైన మొక్క అయితే ప్రభుత్వ అధికారులు ఎందుకు అనుమతిచ్చారు? ప్రమాదమని తెలిసినా ఎందుకు నివారణ చర్యలు తీసుకోవడం లేదని కొందరు పర్యావరణ ప్రేమికులు అధికారులకు వినతిపత్రాలు అందజేస్తున్నారు.దీనితో ప్రజల్లో ఈ మొక్కపై తీవ్ర ఆందోళన నెలకొంది.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మొక్కపై నిషేధం విధించిందని తెలుస్తోంది.అయితే ఇంతకీ ఆ మొక్క ఎక్కడిది?ఇక్కడికి ఎలా వచ్చింది?అంతటి ప్రమాదకరమే అయితే ప్రభుత్వం ఎందుకు హరితహారంలో నాటించింది?ఈ మొక్కపై ఎలాంటి పరిశోధన చేయకుండానే బయటికి వచ్చిందా?ఇప్పుడు ఎలా ఇది విషవాయువులిచ్చే మొక్కని తేలిందనే అంశాలపై స్పష్టత కరువైంది.సాధారణంగా పచ్చగా,ఏపుగా పెరిగే మొక్కలను ఇళ్లలో పెంచుకోవడానికి మొగ్గు చూపుతారు.

చూసేందుకు అందంగా కనిపించే కోనో కార్పస్ మొక్కను రోడ్డు డివైడర్ల మధ్యలో, నర్సరీల్లో,ఇళ్లల్లోనూ పెంచారు.ఈ మొక్క నాటిన కొన్ని వారాల్లో ఏపుగా వెరీగాయి.

ఇంతలోనే ఎక్కడా ఈ మొక్కలను పెంచవద్దని నిషేధం విధించడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు.ఈ మొక్క ప్రమాదని,ఈ చెట్టు వేరు భూ గర్భంలో 80 మీటర్ల వరకూ వెళ్లి నీరును తాగేస్తుందని,కోనో కార్పస్‌ పువ్వులోని పుప్పొడి కారణంగా మానవాళితో పాటు పక్షులకు కూడా ప్రమాదం వాటిల్లే అవకాశాలున్నాయని,ఈ మొక్కలపై సీతాకోక చిలుకలు సైతం వాలడం లేదని,జంతువులు కూడా ఈ మొక్క ఆకులు తినడం లేదని పరిశోధకులు స్పష్టం చేసిన నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు భయాందోళన చెందుతూ మొక్కలు తొలగిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో ఈ మొక్కలు విరివిగా పెంచారు.తెలంగాణలో అయితే హరితహారంలో భాగంగా రాష్ట్రమంతా పెంచారు.

అయితే ఇది ప్రమాదకర మొక్కని ఆలస్యంగా గ్రహించి ప్రస్తుతం అన్ని చోట్ల ఈ మొక్కలను తొలగిస్తున్నట్లు సమాచారం.ఇదిలా ఉంటే సూర్యాపేట జిల్లా నేరేడుచర్ల మున్సిపాలిటీ పరిధిలో వేసిన కోనో కార్పస్ చెట్లను వెంటనే తొలగించాలని సామాజిక కార్యకర్త,న్యాయవాది సుంకరి క్రాంతి కుమార్ శనివారం మున్సిపల్ అధికారి అశోక్ రెడ్డికి వినతిపత్రం అందించారు.

పాలకవీడు మండలం పలు గ్రామాలలో హరితహారంలో నాటిన మొక్కలను ప్రజలే తొలగిస్తున్నారని,పల్లె ప్రకృతి వనాల్లో నాటిన కోనో కార్పస్ మొక్కను తొలగించాలంటూ గ్రామీణ ప్రాంతాల ప్రజలు డిమాండ్ చేస్తున్నారని ఆయన తెలిపారు.దీనిపై మున్సిపల్ అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి మరి!

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube