సూర్యాపేట జిల్లా:కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమాన్ని విస్మరిస్తూ కార్పొరేట్ రంగాలకు తొత్తులుగా వ్యవహరిస్తున్నాయని ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి మేకల శ్రీనివాసరావు అన్నారు.మంగళవారం జిల్లా కేంద్రంలోని కామ్రేడ్ ధర్మాభిక్షం భవనంలో జిల్లా గౌరవ అధ్యక్షులు చామల అశోక్ అధ్యక్షతన జరిగిన ఏఐటియుసి సూర్యాపేట నియోజకవర్గ సమావేశానికి అయన ముఖ్యాతిథిగా హాజరై మాట్లాడుతూ అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు పని భద్రత లేకపోవడం వల్ల కనీసం వేతనం అందకుండా దుర్భరమైన జీవితాన్ని అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ పని భద్రత కల్పించేంతవరకు ఏఐటియుసి ఆధ్వర్యంలో పోరాటాలు నిర్వహిస్తామని హెచ్చరించారు.ఈ సమావేశంలో ఏఐటియుసి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ రాజారాం,జిల్లా ఉపాధ్యక్షులు శ్యాంసుందర్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి నిమ్మల ప్రభాకర్,సిపిఐ పట్టణ కార్యదర్శి బూర వెంకటేశ్వర్లు, నియోజకవర్గం ఉపాధ్యక్షులు దికొండ శ్రీనివాస్,కోశాధికారి గాలి కృష్ణ,ఎండి పాషా, క్యాటరింగ్ వర్కర్స్ నాయకులు కోటి,రిక్షా వర్కర్స్ యూనియన్ నాయకులు కృష్ణ,శేఖర్, తదితరులు పాల్గొన్నారు.