సూర్యాపేట జిల్లా:జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే( SP Rahul Hegde ) ఆదేశాల మేరకు కోదాడ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నెమలిపురి గురుకుల కళాశాలలో పోలీసు కళా బృందం అధ్వర్యంలో బుధవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు.మహిళల,విద్యార్దినుల రక్షణ చట్టాలు,విద్యా విధానాలు, సమస్యలను అధిగమించడం, సోషల్ మీడియా,ఇంటర్నెట్ సద్వినియోగం లాంటి అంశాలపై మరియు విద్యార్థులు ఒత్తిడి అధిగమించి లక్ష్యాలను ఎలా చేరుకోవాలి,లక్ష్యం కోసం ఎలా కృషి చేయాలనే అంశాలతో పాటు సామాజిక అంశాలపై పోలీస్ కళా బృందం సాంస్కృతిక,జానపద కార్యక్రమాలతో విద్యార్దులకు, గ్రామ ప్రజలకు అవగాహన కల్పించారు.
అనంతరం కోదాడ రూరల్ ఎస్ఐ ఎం.అనిల్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే అధ్వర్యంలో మహిళల రక్షణపై పటిష్టంగా పని చేస్తున్నామని,గ్రామాల్లో ఎలాంటి సమస్యలు వచ్చినా శాంతిభద్రతలకు ఆటంకం కలిగించకుండా పరిష్కారం చేసుకోవాలని,చట్టాలను చేతుల్లోకి తీసుకోకుండా వాటిని గౌరవించి పోలీస్ వారికి తెలియపరచాలని కోరారు.ఇంటర్నెట్ ను సద్వినియోగం చేసుకోవాలని,సోషల్ మీడియాలో ఎవరినైనా ఉద్దేశించి అభ్యంతరకరమైన పోస్టులు పెట్టరాదని,సైబర్ మోసగాళ్ళ బారిన పడకుండా జాగ్రత్తలు పాటించాలని, వ్యక్తిగత వివరాలు,బ్యాంక్ ఖాతా,ఏటిఎం కార్డ్,ఓటిపి వివరాలు ఇతరులకు తెలపవద్దని,ఇతరులు ఆశ చూపితే వాటికి ఆకర్షితులు కావద్దని,మెసేజ్ లలో వచ్చే బ్లూ లింక్ అనుసరించి వ్యక్తిగత వివరాలు నమోదు చేయవద్దని,సైబర్ మోసాలపై 1930 టోల్ ఫ్రీ నంబర్ కు ఫిర్యాదు చేయాలని,అలాగే వేధింపులపై 100 కు సమాచారం ఇవ్వాలని సూచించారు.ఈ కార్యక్రమంలో గురుకుల కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ బి.కవితారాణి, సూర్యాపేట షీ టీం కానిస్టేబుల్ శివరాం,పోలీస్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ శ్రీనివరావు, కానిస్టేబుల్ వెంకటనారాయణ, చంద్రశేఖర్,శ్రీనివాసు,పోలీస్ కళాబృందం ఇంచార్జ్ యల్లయ్య,గోపి,నాగార్జున, క్రిష్ణ,చారి మరియు ఉపాధ్యాయ బృందం, విద్యార్థులు,ప్రజలు పాల్గొన్నారు
.