నల్లగొండ జిల్లా:దేవరకొండ నియోజకవర్గం కొండమల్లేపల్లి మండలం పెండ్లిపాకుల విద్యుత్ సబ్ స్టేషన్ ముందు కరెంట్ కోతలను నిరసిస్తూ రైతుల ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా అన్నదాతలు మాట్లడుతూ మూడు రోజులుగా త్రీ పేస్ కరెంట్ రాక పంటలు ఎండిపోయి పంటనష్టం కలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
చేతికొచ్చిన వరి,వేరుశనగ పంటలు సకాలంలో విద్యుత్ రాక,నీరందక ఎండిపోయే స్థితికి వచ్చాయని తెలిపారు.
రైతులకు ఇలాంటి సమయంలో విద్యుత్ కోతలు చేయడం వల్ల తీవ్రంగా నష్టపోతే అప్పుల ఊబిలో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.
రైతులు కరెంట్ కష్టాలు పడుతుంటే పట్టించుకునే నాధుడే కరువయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇప్పటికైనా విద్యుత్ ఉన్నతాధికారులుస్పందించి పంటపొలాలను కాపాడాల్సిందిగా కోరారు.
రైతాంగం రాత్రింబవళ్ళు పనిచేసేది పొట్టకూటి కోసమేనని,కరెంటు కోతలతో తమ కడుపు నింపే పాడిపంటలు ఎండిపోయేలా చేసి రైతుల కడుపు కొట్టొద్దని అన్నారు.